»   » బాలకృష్ణ ఆ బాటిల్ ఆపి ఈ బాటిల్ తోనే సరి...

బాలకృష్ణ ఆ బాటిల్ ఆపి ఈ బాటిల్ తోనే సరి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో నటించేటప్పుడు చాలా డిసిప్లేన్ గా ఉండేవారని చెప్తారు. ఆ సమయమంలో చివరకు నాన్ వెజ్ ని కూడా ముట్టుకోవటానికి సాహసించేవారు కాదు. ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ కూడా తండ్రి రూటులోనే ప్రయాణం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బాపు దర్శకత్వంలో రూపొందుతున్న రామ రాజ్యం చిత్రం ప్రారంభం నాటి నుంచి ఆయన మందు, నాన్ వెజ్ ని దూరంగా పెట్టారుట. అలాగే ఎప్పుడూ ఫుల్ బాటిల్ మంచినీళ్ళు దగ్గర పెట్టుకుని దానితోనే కడుపునింపుకుని ఓ పూట ఉపవాశం చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే రాత్రిళ్ళు నేల పై చాప పరుచుకుని దానిపైనే పడుకుంటున్నారని ఆయన సహచరులు చెప్తున్నారు. అలాగే మంచినీళ్ళు ఎక్కువ త్రాగటం ద్వారా మొహంలో ఓ విధమైన తేజస్సు పెరుగుతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ..శ్రీరాముడుగాను, నయనతార సీతగానూ కనిపించనున్నారు.

బాపు దర్శకత్వంలో శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది పాటల రికార్డింగ్ పూర్తయింది. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu