»   » హాట్ న్యూస్: బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారోచ్...

హాట్ న్యూస్: బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారోచ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సింహా చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి అదరకొట్టిన బాలయ్య...ఆ కిక్ చాలదనుకున్నారో ఏమో గాని త్రిపాత్రాభినయనానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మాకుమార్ చౌదరి నిర్మించే చిత్రంలో ఈ త్రిపాత్రాభినయం చూడనున్నాము. తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు తరాలను ప్రతిభింబించే ఈ పాత్ర డిజైన్స్ ని కంప్యూటర్ లో తయారుచేసుకుని బాలయ్యచేత ఓకే చేయించుకుని ఆ గెటప్స్ రెడీ చేసే పనిలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సమ్మర్ ‌లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఊటీలో కానీ మౌంట్ ఆబులో కానీ చిత్రం షూటింగ్ ఉంటుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu