Balakrishna కోసం కథ సెట్ చేస్తున్న రొమాంటిక్ దర్శకుడు.. ఈ కాంబినేషన్ ఎవరు ఊహించి ఉండరు!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కూడా దర్శకులకు ఉండే కామన్ కోరిక.. ప్రతి హీరోతో వర్క్ చేయాలని ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వేగంగా సినిమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని. అందుకే దర్శకులు టైమ్ దొరికినప్పుడే హీరోల డేట్స్ ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటారు. ఇక ప్రస్తుతం ఒక రొమాంటిక్ సినిమాల దర్శకుడు బాలకృష్ణ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్ వస్తోంది. అతని గత చిత్రాలను బట్టి చూస్తే లవ్ స్టారి ఏదైనా రాస్తున్నాడా అనే అనుమానం రాకుండా ఉండదు.

ఆ విధంగా దర్శకులకు గౌరవం ఇస్తారు.

ఆ విధంగా దర్శకులకు గౌరవం ఇస్తారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి దర్శకులతో అయినా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండే హీరోలలో బాలకృష్ణ ఒకరు. ఒక సినిమాకు ప్రధాన గురువు దర్శకుడే అని డైరెక్ట్ గానే చెప్పేస్తారు. బాలయ్యతో వర్క్ చేసిన ప్రతి దర్శకుడు కూడా మరోసారి ఆయనతో వర్క్ చేయాలని అనుకుంటారు. ఆ విధంగా దర్శకులకు గౌరవం ఇస్తారు.

బాలయ్యకు కథ నచ్చితే

బాలయ్యకు కథ నచ్చితే

బాలయ్యకు కథ నచ్చితే దర్శకుడు ప్లాప్ లో ఉన్నాడా? సక్సెస్ లో ఉన్నాడా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకే చిన్న దర్శకులకు కూడా ఆయన అవకాశం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఆయన మాస్ ఇమేజ్ కు సంబంధం లేని దర్శకులతో సినిమా తీస్తే తప్పకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు.

వెంకీ అట్లూరితో మొదటిసారి

వెంకీ అట్లూరితో మొదటిసారి

రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు అందుకున్న వెంకీ అట్లూరి కూడా ఇటీవల బాలయ్యకు ఒక లైన్ వినిపించినట్లు సమాచారం. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ ఇంతవరకు మాస్ కథలను టచ్ చేసింది లేదు. అందుకే ఈసారి కాస్త ఫార్మాట్ ను చేంజ్ చేస్తున్నట్లు సమాచారం.

Recommended Video

Anandayya మందు పై గళం విప్పుతున్న Tollywood ప్రముఖులు || Filmibeat Telugu
లవ్ స్టొరీ రాస్తున్నాడా?

లవ్ స్టొరీ రాస్తున్నాడా?

ఎక్కువగా అయితే బాలయ్య కోసం మరో లవ్ స్టోరీని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అలాగే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి సక్సెస్ ఫుల్ దర్శకులతో వర్క్ చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X