»   » జ‌బ‌ర్ద‌స్త్ ఆదిని చంపేయ్.. బాలకృష్ణ వార్నింగ్!

జ‌బ‌ర్ద‌స్త్ ఆదిని చంపేయ్.. బాలకృష్ణ వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జ‌బ‌ర్ద‌స్త్ షోలో కామెడీతో విశేషంగా ఆకట్టుకొంటున్న హైపర్ ఆదికి నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల వార్నింగ్ ఇచ్చినట్టు ఓ వార్త విస్త్రృతంగా ప్రచారమవుతున్నది. తన తండ్రి, నటరత్న, మాజీ సీఎం నందమూరి తారకరామారావు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా జబర్దస్ట్ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన్నట్టు తెలుస్తున్నది. ఆదిని చంపేయ్యమంటూ తన పీఏను ఆదేశించినట్టు ఓ రూమర్ వైరల్‌గా మారింది.

గతంలో ఆది అభి బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు దివంగ‌త లెజెండ్రీ హీరో ఎన్టీఆర్ పై ఓ స్కిట్ చేశాడ‌ట‌. అందులో పొర‌పాటుగా ఎన్టీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడట. ఈ సంగతి తెలుసుకున్న బాల‌య్య‌.. త‌న పీఏ చేత ఆదికి ఫోన్ చేయించాడ‌ట‌. మిమ్మ‌ల్ని చంపమ‌న్నాడు..చంపేయాలా అని ఆదితో బాలయ్య పీఏ అడిగాడట.

Balakrishna warning to Jabardast Hyper Aadi

దీంతో కంగారు పడిన ఆది అలాంటి త‌ప్పు మరోసారి చేయ‌న‌ని సారీ చెప్పాడ‌ట‌. ఆ త‌ర్వాత బాల‌య్య పీఏ కూడా స‌ర‌దాగా అన్నాన‌ని చెప్ప‌డంతో హైప‌ర్ ఆది చల్లబడ్డాడట. ఆ చేదు అనుభవం తర్వాత అగ్ర హీరోల‌పై జోకులు వేయ‌డం మానేసిండట. ఈ విషయాన్ని ఇటీవల ఆది ఓ కార్యక్రమంలో స్వయంగా చెప్పినట్టు సమాచారం.

English summary
Hyper Aadi is now well known actor in Television industry. Aadi made contraversial statement in Jabardast show recently. Those comment make Balakrishna angry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu