»   » ‘లయిన్’లో బాలకృష్ణ పాత్ర ఎవరిని పోలి ఉంటుందంటే...

‘లయిన్’లో బాలకృష్ణ పాత్ర ఎవరిని పోలి ఉంటుందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నూతన దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్న ‘లయిన్'చిత్రం లో బాలకృష్ణ ...సిబీఐ ఆఫీసర్ జెడి లక్ష్మీ నారాయణను పోలిన పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా సాగుతుందని, కొన్ని నిజ జీవిత సంఘటనలు సైతం ఈ సినిమాలో ఉండబోతునట్లు తెలుస్తోంది. నీతికి, నిజాయితి కు మారుపేరుగా తను నమ్మిన సిద్దాంతం కోసం, తన డ్యూటీ కోసం ఎంత దూరం అయినా వెళ్లే ఆఫీసర్ గా బాలయ్య అదరకొడతారని అంటున్నారు. బాలకృష్ణ హిట్ చిత్రం లెజండ్ విడుదల తేదీ నే అంటే మార్చి 28న ఈ కొత్త చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించికున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.

Balayya plays as JD Lakshminarayana

ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Balakrishna plays a CBI officer in ‘Lion’ film as per our sources the role of Balakrishna is based on the real CBI officer J.D. Lakshminarayana.
Please Wait while comments are loading...