»   » 'ఊ... కొడతారా..!? ఉలిక్కిపడతారా..!?' లో బాలకృష్ణ చేసే పాత్ర వివరాలు

'ఊ... కొడతారా..!? ఉలిక్కిపడతారా..!?' లో బాలకృష్ణ చేసే పాత్ర వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ అప్పట్లో ఆదిత్యా 369 లో శ్రీకృష్ణ దేవరాయులుగా నటించి శభాష్ అనిపించుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకు మరోసారి మహారాజుగా కనిపించనున్నారని సమాచారం. మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించే చిత్రం 'ఊ... కొడతారా..!? ఉలిక్కిపడతారా..!?' చిత్రం కోసం బాలయ్య ఈ అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా శేఖర్ రాజా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రం కోసం దాదాపు మూడున్నర కోట్లతో మణికొండలో ఓ సెట్ నిర్మిస్తున్నారు. ఇక ఈ పాత్ర దాదాపు ముఫ్పై నిముషాల పాటు ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో లక్ష్మి ప్రసన్న కూడా ఓ కీలకమైన పాత్రను పోషించనుంది.ప్రస్తుతం ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.

English summary
Nandamuri Balakrishna and Manchu Manoj’s new movie U… Kodathara Ulikkipadathara is currently busy in Pre production. A huge set worth 3.5 Crores is being erected at Manikonda for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu