»   »  బాలకృష్ణ కోసం టు పీస్ బికిలోనిలో

బాలకృష్ణ కోసం టు పీస్ బికిలోనిలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, అంజలి నటిస్తున్న కొత్త చిత్రం ' 'డిక్టేటర్‌'‌'. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామర్ డోస్ ని బాగా పెంచారని, అందుకోసం హీరోయిన్ సోనాలి చౌహాన్ టు బీస్ బికినీలో కనిపించనుందని సమాచారం. లెజండ్ లో బాలయ్యతో చేసిన సోనాలి ఈ సినిమాలో తన అందాలను మరోసారి ఆరబోస్తోంది. వారి కెమెస్ట్రీ తెరపై అభిమానులను ఓ రేంజిలో అలరించనుంది.


Balayya's Dictator: Sonal Chauhan to appear in bikini

ఇక ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇది బాలకృష్ణకు 99వ చిత్రం కావడం విశేషం. ఈ ఆడియో విడుదల సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ చూడండి.బాలయ్య మాట్లాడుతూ......సోనాల్‌ చౌహాన్‌ తపన ఉన్న నటి. ‘లెజెండ్‌' సమయంలోనే ఆమె ప్రతిభ తెలిసింది అన్నారు.


శ్రీవాస్‌ మాట్లాడుతూ.... ‘‘లౌక్యం' తర్వాత బాలకృష్ణగారిని కలిశాను. ‘మనం ఒక సినిమా చేద్దాం సర్‌' అంటే వెంటనే ఓకే చెప్పేశారు. ఆయన నా మీద ఉంచిన నమ్మకమది. బాలకృష్ణతో పని చేయడం కష్టం అంటుంటారు. కానీ ఆయనతో పని చేసి చెప్తున్నా.. ఆయనతో పనిచేయడం చాలా సులభం. ఆయన దగ్గర అబద్దం చెప్పినా, నిజం దాచినా నచ్చదు. తన చుట్టుపక్కల వాళ్లూ అలాంటోళ్లు ఉండాలని కోరుకుంటారు. నేను ఆయనలాగే ఉన్నాను. అందుకే ఆయనతో పని చేయడం సులభమైపోయింది అన్నారు.


నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.


English summary
Sonal will be seen in a two piece bikini in the upcoming film Dictator.
Please Wait while comments are loading...