»   »  'గబ్బర్ సింగ్' తో పోలికెందుకు?

'గబ్బర్ సింగ్' తో పోలికెందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గబ్బర్ సింగ్ ...ఎంత సంచలన విజయం సాధించిందో పవన్ అభిమానులు ఎప్పుటికీ మర్చిపోరు. ఆ చిత్రం నిర్మాత బండ్ల గణేష్ తన తాజా చిత్రం గోవిందుడు అందరివాడేలా ని ఇప్పుడు గబ్బర్ సింగ్ తో పోలుస్తూ ట్వీట్ చేసాడు. గోవిందుడు అందరి వాడేలా చిత్రం షూటింగ్ చూస్తుంటే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ నుంచి మరో గబ్బర్ సింగ్ వస్తోంది అనిపిస్తోందంటట...కృష్ణ వంశీ మైండ్ బ్లోయింగ్ విజన్ అంటూ పొగడ్తలతో ట్వీట్ చేసాడు. ఇది చదివిన ఫ్యాన్స్... రిలీజ్ అయ్యాక..అది గబ్బర్ సింగ్ రేంజో మగధీర రేంజో చూసుకోవచ్చు..ఇప్పుడు ఆ చిత్రంతో పోలిక ఎందుకు అంటున్నారు. తను నిర్మించిన చిత్రం కాబట్టి బండ్ల గణేష్ ఉత్సాహంగా గబ్బర్ సింగ్ తో పోల్చేసాడు.

రామ్‌చరణ్, కాజల్ జంటగా పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ రూపొందిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం అక్టోబర్ 1 విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- కమ్మని కుటుంబకథా చిత్రంగా తమ సంస్థ రూపొందించిన చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రూపొందించామని, కుటుంబ వ్యవస్థపై రాబోయే పదితరాల వరకు నమ్మకం కలిగించేలా దర్శకుడు చిత్రీకరించారని తెలిపారు. ఈ చిత్రంలో హీరో తాతగా రాజ్‌కిరణ్ నటించారని, అయితే ఆ సన్నివేశాలు తెలుగు వాతావరణాన్ని ప్రతిబింబించకపోవడంతో కొంత భయంతో ప్రకాష్‌రాజ్‌తో తిరిగి రూపొందించామని, అద్భుతమైన కుటుంబ కథా చిత్రం మరలా తీయలేనేమో అన్న అనుమానంతో ఈ మార్పులు చేశామని, జయసుధ నాయమ్మగా నటిస్తున్నారని ఆయన అన్నారు.

Banda Ganesh said Another Gabbar Singh in making!

జూలై చివరివరకు ఇక్కడ షూటింగ్ చేసి ఆగస్టు 15కు లండన్‌లో పాటల చిత్రీకరణ జరుపుతామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తామని తెలిపారు. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, జయసుధ, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, కాశీవిశ్వనాధ్, ప్రగతి, సమీర్, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గిరిధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి, సంగీతం:యువన్ శంకర్‌రాజా, ఎడిటింగ్:నవీన్, కెమెరా:సమీర్‌రెడ్డి, మాటలు:పరుచూరి బ్రదర్స్, నిర్మాత:బండ్ల గణేష్, దర్శకత్వం:కృష్ణవంశీ. (చిత్రం) రామ్‌చరణ్, కాజల్

English summary
Bandla Ganesh Tweeted: G A V - Mindblowing Vision of K V - One more Gabbar Singh in making from PARAMESWARA ART PRODUCTIONS thank u sir :))
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu