హైదరాబాద్: ప్రస్తుతం రామ్ చరణ్ తో చిత్రం నిర్మిస్తున్న బండ్ల గణేష్ కి మరో స్టార్ డేట్స్ ఇవ్వడంతో ఆనందంలో మునిగితేలుతున్నాడని సమాచారం. ఇంతకీ గణేష్ కు డేట్స్ ఇచ్చిన హీరో ఎవరూ అంటే ఎన్టీఆర్. మే 20 అంటే ఎన్టీఆర్ పుట్టిన రోజున గ్రాండ్ గా సినిమా లాంచ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరక్ట్ చేయనున్నారు. భారీగా ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో బండ్ల గణేష్ ఉన్నారు.
గతంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా చిత్రాన్ని సైతం బండ్ల గణేష్ నిర్మించారు. అందుకే మరోసారి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్..రామ్ చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే చిత్రం నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్ ఈ కాంబినేషన్ కుదర్చడానికి చాలా కాలంగా ప్రయత్నించాడు. కానీ... ఇన్నాళ్లకి కుదిరింది.
ఈ చిత్రానికి సంభందించిన కథని ఇప్పటికే పూరీ ఓకే చేయించుకున్నట్లు సమాచారం. అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.... సంతోష్ శ్రీన్‌వాస్ కలయికలో ఈ 'రభస' చిత్రం రూపుదిద్దుకొంటోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. రాజధానిలో చిత్రీకరణ జరుగుతోంది. కుటుంబ నేపథ్యంలో నడిచే కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాణగం పాల్గొంటున్నారు. మరో పది రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. ఈ సీన్స్ సినిమాలో హెలెట్ అవుతాయంటున్నారు.
After Andhrawala debacle, Puri Jagannath and NTR Jr are planning to team up once again. Bandla Ganesh is planning tyo bring this combination on his Parameswara Arts banner. Indications are coming out that the film would be titled as 'Kummestha' and will be launched in grand manner on May 20 - to coincide with the actor's birthday.
Story first published: Monday, April 21, 2014, 12:31 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more