twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa OTTలో ఇంత త్వరగా రిలీజ్ చేయడానికి కారణం ఏమిటంటే.. మంచి నిర్ణయమే?

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సారి తన స్టైల్ కు భిన్నంగా పుష్ప సినిమాలో కనిపించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై మొదటి నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అయితే విడుదల తర్వాత కొంత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్స్ తో మొత్తానికి బ్రేక్ ఈవెన్ చేసింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ముఖ్యమైన ఏరియాల్లో మాత్రం సినిమా అనుకున్న టార్గెట్ ను పూర్తి చేయలేకపోయింది. ఇక ఓటీటీలో ఇంత త్వరగా రిలీజ్ చేయడానికి ఒక మంచి కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఆంధ్ర ఏరియాల్లో నష్టాలు

    ఆంధ్ర ఏరియాల్లో నష్టాలు

    నైజాంలో 40 కోట్లకు పైగా షేర్ వసూలు అందుకున్న పుష్ప సినిమా దాదాపు నాలుగు కోట్లకు పైగా లాభాలను అందించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు, కృష్ణ, గుంటూరు ఇలా ఆంధ్రప్రదేశ్లోని చాలా ఏరియాల్లో సినిమా పెట్టిన పెట్టుబడికి సగం వసూళ్లను మాత్రమే రాబట్టింది.

    టికెట్ల రెట్లే కారణం..

    టికెట్ల రెట్లే కారణం..

    కొన్ని ఏరియాల్లో అయితే సగం కూడా రాలేవు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు ఎప్పటి తరహాలోనే ఉంటే మాత్రం ఆ టార్గెట్ ను చాలా ఈజీగా పూర్తి చేసుకొని ఉండేదని చెప్పవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తగ్గిపోవడం వలన తీవ్రంగా ప్రభావం పడింది. ఆ విషయం పుష్ప సినిమాతో చాలా క్లారిటీ గా అ

     50 ఆక్యుపెన్సీ తోనే..

    50 ఆక్యుపెన్సీ తోనే..

    పరిస్థితులు ఎప్పటికైనా బాగుపడతాయని డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టి మరి రిలీజ్ హక్కులను కొనుగోలు చేశారు. ఇక వారు నష్టాలకు గురి కావడంతో వారికి సహాయ పడే విధంగా మైత్రి మూవీ మేకర్స్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ఎలాగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో చాలా వరకు 50% ఆక్యుపెన్సీ తోనే థియేటర్స్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

     వాళ్ల కోసమే ఓటీటీ డీల్

    వాళ్ల కోసమే ఓటీటీ డీల్

    ఇక ఈ సమయంలో అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చిన అడ్వాన్స్ ఆఫర్ ప్రకారం ఆ వచ్చిన డబ్బుతో ఆంధ్ర ప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను పూరించనున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా మైత్రి మూవీ మేకర్స్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది అనే చెప్పాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ప్రొడక్షన్ నుంచి ఇంకా చాలా సినిమాలు విడుదలకు సిద్ధం కావాల్సి ఉంది. కాబట్టే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు కూడా బాగుంటేనే ఆ సినిమాలు కూడా పాజిటివ్ గా విడుదలవుతాయి. జనవరి 7వ తేదీ నుంచి పుష్ప అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయనుంది.

    కెలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

    కెలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

    ఇక మొత్తానికి పుష్ప సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో అల్లు అర్జున్ కెరీర్ లోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక షేర్ పరంగా చూసుకుంటే 159 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రస్తుతం 13.44కోట్ల ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది. ఇక హిందీలో ఈ సినిమాను 10 కోట్లకు అమ్ముడవ్వగా దాదాపు 30 కోట్లకు పైగా లాభాలను అందించింది. ఇక తమిళనాడులో కూడా ఆరు కోట్ల రిలీజ్ బిజినెస్ తో విడుదలయిన పుష్ప సినిమా 10 కోట్ల వరకు షేర్ అందుకోవడం విశేషం.

    English summary
    Behind the reason on pushpa ott release,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X