»   » బెల్లంకొండ ఆ హీరోకు భయపడే కాన్సిల్ చేసుకున్నాడా!?

బెల్లంకొండ ఆ హీరోకు భయపడే కాన్సిల్ చేసుకున్నాడా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bellamkonda Suresh
హైదరాబాద్ : గత రెండు రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో బెల్లంకొండ సురేష్ టాపిక్ రన్ అవుతోంది. ఆయన మంచు మనోజ్ తో నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అనుకున్న ప్రాజెక్టు కాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఎందుకలా కాన్సిల్ చేయవలిసి వచ్చిందనేదానికి ఎవరికి తోచినట్లు వారు కారణాలు వెతుక్కుుంటున్నారు.

కొందరైతే మంచు మనోజ్ ని కంట్రోలు చేయటం కష్టమని, అందునా మంచు ప్యామిలీతో మనకెందుకు వచ్చిందని తప్పుకుందని చెప్పుకుంటున్నారు. మనోజ్ ...దర్శకత్వంలోనూ వేలు పెడతాడని, అతను ఎంత మంచి నటన చేసినా అతనితో చేసిన ప్రాజెక్టులు సక్సెస్ కాకపోవటానికి అదే కారణమని, అతను ఆసక్తిగా అన్ని విభాగాల్లో ఇంటర్ ఫియర్ అవుతాడని రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే బెల్లంకొండ ఆ ప్రాజెక్ట్ కాన్సిల్ చేయటానికి వాస్తవమైన కారణమేంటనేది మాత్రం బయిటకు రాలేదు.

దేనికైనా రెడి సక్సెస్ అయిన వెంటనే ఆ చిత్ర దర్శకుడు నాగేశ్వరరెడ్డితో ఆ ప్రాజెక్టుని ప్రకటించారు బెల్లంకొండ. ప్రస్తుతం అదే ప్రాజెక్టుని నిర్మాత పుప్పాల రమేష్ హ్యాండోవర్ చేసుకున్నాడు. ఈ చిత్రం గురించి నిర్మాత పుప్పాల రమేష్ మాట్లాడుతూ...మంచు మనోజ్-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో మా బేనర్లో 4వ చిత్రంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. జులై 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వినోదాత్మకంగా ఈచిత్రం ఉంటుందన్నారు.

దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ....ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నాం. అందరికీ నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి మాటలు : మరుధూరి రాజా, ఫోటోగ్రపీ :సిద్ధార్థ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్, గోపీ మోహన్, బి.వి.ఎస్.రవి, నిర్మాత : పుప్పాల రమేష్, కథ-దర్శకత్వం : నాగేశ్వరరెడ్డి. జి.

English summary

 Rumors spread Bellamkonda was afraid that he hasn’t got enough power to control manchu manoj’s creativity on sets once if their project with Nageshwar Reddy could have gone on sets. In fact, a formal agreement and brief discussions also went on between Bellamkonda, Manoj and Nageshwar Reddy but now Ramesh Puppala of Yellow Flowers entered into the scene as final producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu