»   » నితిన్ దర్శకుడుతో బెల్లంకొండ శ్రీనివాస్ నెక్ట్స్

నితిన్ దర్శకుడుతో బెల్లంకొండ శ్రీనివాస్ నెక్ట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నితిన్ తో గుండె జారి గల్లంతైంది వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండ తన తదుపరి చిత్రానికి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ని ఎంచుకున్నారు. ఈ మేరకు ఓ లవ్ స్టోరీని చెప్పి ఒప్పించినట్లు సమాచారం. నాగ చైతన్య తో చేసిన ఒక లైలా కోసం చిత్రం డిజాస్టర్ అవటంతో కొండ విజయ్ కుమార్ కు గ్యాప్ వచ్చింది. వెంటనే సినిమా ప్రారంభించలేకపోయారు. అయితే రీసెంట్ గా ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అయినట్లు చెప్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. కన్నడంలో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన నిర్మాతలు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తమిళంలో విజయంతమైన 'సుందరిపాండ్యన్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'స్పీడున్నోడు' అనే పేరు ప్రచారంలో ఉంది. అందులో తమన్నా ప్రత్యేకగీతం చేస్తున్నందుకుగానూ భారీగా పారితోషికం అందుకొంటోందట.

Bellamkonda Sreenivas’s next with Vijay Kumar Konda

తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా ఈ సినిమాను రూపొందించి విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

తమిళంలో విజయం సాధించిన 'సుందర పాండ్యన్' రీమేక్ హక్కులను గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు 'భీమనేని'. ఈ చిత్రాన్నే తెలుగులో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిస్తున్నారు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉండే ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు, హీరో కూడా అయిన 'శివ' నటించగా, ఆయన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ 'సుందర పాండ్యన్'ను తెరకెక్కించారు.

English summary
Bellamkonda Sreenivas has okayed his third film, a breezy love story in the direction of Vijay Kumar Konda of Gunde Jaari Gallanthayyinde and Oka Laila Kosam fame.
Please Wait while comments are loading...