యంగ్ హీరోతో భాగ్యశ్రీ భోర్సే డేటింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా అలా దొరికిపోయారుగా?
టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్లు సీక్రెట్‌గా ఎఫైర్లు నడుపుతున్నారు. వీరిలో కొందరు తమ బంధాన్ని ఏదో రకంగా బయట పెడుతూనే ఉన్నారు తప్పించి అధికారికంగా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దినెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈరోజుకూ వీరిద్దరూ తమ బంధంపై పెదవి విప్పలేదు.. కానీ ఇన్‌డైరెక్ట్‌గా ఒకరిపై ఇష్టాన్ని మరొకరు బయటపెడుతున్నారు. తాజాగా ఇదే లిస్ట్‌లో మరో జంట చేరింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఫ్లాప్‌తో టాలీవుడ్ ఎంట్రీ
మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. మరాఠా సామ్రాజ్యం నుంచి ఇక్కడికి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మకు తొలి చిత్రంతోనే ఫ్లాప్ స్వాగతం పలికింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందాలకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుసగా అవకాశాలు క్యూకడుతున్నాయి. కింగ్డమ్, కాంత తదితర సినిమాలలో ఆఫర్లు కొట్టేసిన భాగ్యశ్రీ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటిస్తున్నారు.

రామ్‌తో భాగ్యశ్రీ డేటింగ్
ఇప్పటికీ రిలీజైన వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీరిద్దరి మధ్య యవ్వారం నడుస్తోందని.. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్, భాగ్యశ్రీల మధ్య ఏర్పడిన స్నేహం .. ప్రేమగా మారిందని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలలో లోకేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ అన్ని ఓకేలా ఉండటంతో రామ్, భాగ్యశ్రీలు ఒకేచోట ఉన్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొన్నామధ్య భాగ్యశ్రీ చేతికి ఉంగరం ఉండటంతో రామ్‌తో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందన్న రేంజ్‌లో ప్రచారం జరిగింది.
హాట్ టాపిక్‌గా ఉంగరం
మరోవైపు.. రామ్ పోతినేనితో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ వస్తున్న వార్తలపై భాగ్యశ్రీ బోర్సే స్పందించారు. నా వేలికి ఉన్న ఉంగరం నేనే కొనుక్కున్నానని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ పోతినేని స్వయంగా రైటర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒక చూపుతో నాలోన పుట్టిందే.. ఏదో వింతగా గుండెలో చేరిందేనంటూ ఓ పాటను ఆయన రాశారు. అయితే ఇది భాగ్యశ్రీని ఉద్దేశించి రాసినదేనని, ఆమెపై ప్రేమను రామ్ ఇలా వ్యక్తం చేశారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రామ్, భాగ్యశ్రీ
తాజాగా రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేల డేటింగ్‌కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో వేరు వేరుగా ఫోటోలు షేర్ చేసి అడ్డంగా దొరికిపోయారు. హీరో రామ్.. నల్ల కళ్లజోడు పెట్టుకుని వైట్ షర్ట్‌లో స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. ఇంతలో వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్‌లో టేబుల్ పడుకుని రొమాంటిక్ ఫోజుల్లో భాగ్యశ్రీ బోర్సే ట్విస్ట్ ఇచ్చారు. ఆమె కూర్చొన్న టేబుల్ మీద ఉన్న కళ్లజోడు.. రామ్ పెట్టుకున్న కళ్లజోడు ఒకటే కావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అంటే ఇద్దరూ ఒకే దగ్గర ఉండి డ్రామాలు ఆడుతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రామ్, భాగ్యశ్రీలు నిజంగానే ప్రేమలో ఉన్నారని ఇందులో ఏ డౌట్ అక్కర్లేదని అంటున్నారు. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











