»   » మారిన 'భాయ్' ఆడియో విడుదల తేదీ ఇదే

మారిన 'భాయ్' ఆడియో విడుదల తేదీ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున ఈ నెల్లోనే 'భాయ్'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం (అక్టోబర్ 5) ఈ చిత్రం ఆడియో విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజన నోట్ తో సీమాంధ్రలో బంద్ కు పిలుపు ఇవ్వటంతో నాగార్జున ఈ ఈవెంట్ ని ఆపుచేసారు. కొత్త ఆడియో విడుదల తేదీ అక్టోబర్ 11 అని నిర్ణయించినట్లు సమాచారం. అన్నపూర్ణ ఏడెకరాలు లో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ ఆడియో లాంచ్ ని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు బిట్ సాంగ్స్ ని విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక 'హైదరాబాద్‌కి రెండే ఫేమస్‌. ఒకటి ఛాయ్‌. రెండోది భాయ్‌' అంటూ వస్తున్నారు నాగార్జున. ఈ భాయ్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమా కోసం స్లొవేనియాలో 700ఏళ్ల చరిత్ర ఉన్న ప్రెడ్జమా అనే కోటలో పాటను చిత్రించారు. దీని గురించి నాగార్జున చెబుతూ ''పురాతనమైన కోట అయినా ఎంతో కొత్తగా ఉందది. ప్రేక్షకులకు విదేశీ అందాలను పరిచయం చేయడానికే ఇలాంటి ప్రత్యేకమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాము''అన్నారు. ఇందులో నాగ్‌ సరసన రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. వీరభద్రమ్‌ చౌదరి దర్శకుడు.

ఈ సినిమా ప్రారంభం నుంచే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయంటే దానికి కారణం ఆ చిత్ర దర్శకుడు వీరభద్రమ్. ఆయనకు ఇది మూడో చిత్రం. ఇదివరకు ఆయన రూపొందించిన 'అహ నా పెళ్లంట', 'పూలరంగడు' ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించడంతో 'భాయ్'తో ఆయన హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటూ యూనిట్ సభ్యులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ "ఆడియో చాలా బాగా వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా టెర్రిఫిక్‌గా ఇచ్చారు. ఇదివరకు విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. భిన్నమైన ఛాయలున్న పాత్రలో నాగార్జునగారు విజృంభించి నటించారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కచ్చితంగా నాకు హ్యాట్రిక్ మూవీ అవుతుంది'' అని చెప్పారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. నథాలియా కౌర్, కామ్నా జెఠ్మలానీ, హంసానందిని, జరా షా, బ్రహ్మానందం, సోనూ సూద్, ఆశిశ్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆదిత్య మీనన్, సుప్రీత్, అజయ్, ఎమ్మెస్ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.

English summary
Nagarjuna, Richa Gangopadhyaya starrer Bhai is likely to celebrate its audio launch on Oct 11th at Annapurna 7 acres. Actually it was schedule to happen on Oct 5th at Annapurna 7 acres. But due to protests and bundh in Seemandhra region actor and producer Nagarjuna has decided to change the date. According to the buzz this event will happen on 11th October, already 2 bit songs from this movie have been released and getting good response.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu