»   »  'భాయ్‌' దర్శకుడు నెక్ట్స్ ఆ హీరోతో?

'భాయ్‌' దర్శకుడు నెక్ట్స్ ఆ హీరోతో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎనర్జీ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్‌కి ఇటీవల వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. వెంకటేష్‌తో కలిసి చేసిన 'మసాలా' పరాజయాన్ని చవిచూసింది. రామ్‌తో వీరభద్రమ్‌ కూడా ఓ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నాగార్జునతో 'భాయ్‌' తీశారు వీరభద్రమ్‌. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చూసింది. ఆయన రామ్‌కి ఇటీవలే ఓ కథ వినిపించినట్టు సమాచారం. అది నచ్చిన రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.

అయితే మొదట రామ్ ....మరో దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో నటించబోతున్నట్టు సమాచారం. 'యువత', 'సోలో'లాంటి సినిమాలు తీసి విజయాలు అందుకొన్న దర్శకుడు పరశురామ్‌. ఆయన రామ్‌ శైలికి తగ్గట్టుగా కథని సిద్ధం చేసి పెట్టుకొన్నాడట. వీరిద్దరి కలయికలో సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్‌ పతాకంపై పి.రవికిషోర్‌ నిర్మించబోతున్నారు.

ఇక రామ్ తాజా చిత్రం మసాలా విషయానికి వస్తే...విజయభాస్కర్‌.కె దర్శకత్వంలో తెరకెక్కింది. ఎన్నో వాయిదాలు అనంతరం విడుదలైన ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా రూపొందింది. వెంకటేష్‌,రామ్‌ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ రోజు మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మాట్ని నుంచి చాలా చోట్ల కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. రామ్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ చిత్రం అని అంటున్నారు.

అయితే నిర్మాతలు ఈ చిత్రాన్ని మంచి రేట్ కే అమ్ముకున్నారని, ఎగ్జిబిటర్స్,డిస్ట్రిబ్యూటర్స్ కే ఆ నష్టం అని తేలుస్తున్నారు. సినిమా స్టేజి షోలాగ ఉందని కొందరంటూంటే లేదు...అది టీవి ల్లో వచ్చే జబర్ధస్త్ పోగ్రాం లా జోకులు కూర్చినట్లు ఉందని మరికొంతమంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఒరిజనల్ బోల్ బచ్చన్ కథని ఉన్నదున్నట్లు షాట్ బై షాట్ తీసుకుంటూ పోయారని, చివరకు కాస్ట్యూమ్స్ విషయం కూడా మార్పు తేలేదని అందుకే పూర్తిగా నేటివిటీకి దూరమైందని చెప్తున్నారు. వెంకటేష్ పఠానులు వేసుకునే డ్రస్ వేసుకుని, సినిమాలో అరుస్తూ రామ్ ని డామ్ నేట్ చేసే ప్రయత్నం చేసాడని, దాంతో రామ్ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా తక్కువగా కనపడ్డాడని అంటున్నారు.

English summary
Tollywood hero Ram's next movie with Veerabadram is Confirmed.Hero Ram is said to be much excited about the story line narrated by director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu