»   » రామ్ చరణ్, మహేష్‌లకి సునీల్ సవాల్

రామ్ చరణ్, మహేష్‌లకి సునీల్ సవాల్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రామ్ చరణ్, మహేష్ బాబులకు సునీల్ సవాల్ విసరనున్నాడా...తన కామెడీ తో వారితో పోటీకి దిననున్నానడా..అవుననే అంటున్నాయి సీనీ వర్గాలు. వచ్చే నెలలో వచ్చే సంక్రాంతికి సినీ ప్రియులకు పండుగ జరుగనుంది. రామ్ చరణ్ ..ఎవడు చిత్రం,మహేష్ బాబు నేనొక్కడినే చిత్రం రెండూ బరిలోకి దిగుతున్నాయి. వాటితో పోటిగా సునీల్ హీరోగా రెడీ అవుతున్న...'భీమవరం బుల్లోడు'కూడా రానుంది. సునీల్, ఎస్తేర్ జంటగా సురేష్ ప్రొక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో సురేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం 'భీమవరం బుల్లోడు'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. పాటలను 22న అనగా రేపు భీమవరం కళాశాలలో విడుదల చేయనున్నారు.

  సునీల్ మాట్లాడుతూ- కుటుంబం అంతా కలిసి చూడాలన్న కోరికతో ఎటువంటి అశ్లీలత లేకుండా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఎప్పటిలాగే అమాయకంగా, ధైర్యంగా ఉండే పాత్రలో నటించి ప్రేక్షకులను కామెడీ ఎమోషన్ సెంటిమెంట్ యాక్షన్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశానని తెలిపారు. శ్రీధర్ రాసిన మాటలు, అనూప్ సంగీతం చిత్రానికి హైలెట్ అని ఆయన అన్నారు. మార్చి నెలలో ప్రారంభించిన షూటింగ్ పూర్తిచేశామని, ఇటీవల ఓ ప్రమోషనల్ పాట కూడా తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. రొటీన్‌గా కాకుండా కొత్తదనంతో ఉండాలని భీమవరంలో ఆడియో విడుదల చేస్తున్నామని, ప్రతి పాటా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు.

  పెళ్లికాని కుర్రోడు, ప్రేమ జ్వరం ఉన్నోడు, స్నేహమంటే ప్రాణమిస్తాడు ఈ భీమవరం బుల్లోడి నైజం అంటూ ఇందులో హీరోను పరిచయం చేయవచ్చని, సునీల్‌కి ఖచ్చితంగా సరిపోయే ఈ కథ పూర్తి హాస్య చిత్రంగా రూపొందిందని, ఐదు పాటలు అందరికీ నచ్చుతాయని దర్శకుడు ఉదయ్‌శంకర్ తెలిపారు. కార్యక్రమంలో పృధ్వి, సామ్రాట్, షాయాజీ షిండే, భాను, సంతోష్‌రాయ్, శ్రీ్ధర్ సీపన తదితరులు పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, జె.పి, కాశీ విశ్వనాథ్, పోసాని, రఘు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:కవి కాళిదాసు, సంగీతం:అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: మార్తాం డ్ కె.వెంకటేష్, కెమెరా:సంతోష్ రాయ్, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

  ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం సైతం సంక్రాంతి బరి నుంచి తప్పుకుని నిరాశపరిచింది. ఈ చిత్రం మొదట జనవరి 15,2014 విడుదల అనుకున్నారు. కానీ పరిశ్రమలో చెప్పకోబడుతున్న తాజా సమాచారం ప్రకారం..ప్యాచ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని, పిభ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున విడుదల చేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  English summary
  The news in air is that the movie ‘Bheemavaram Bullodu’ is scheduled for release during Sankranthi 2014. 2 big movies ‘ 1 Nenokkadine’(10.01.2014),”Yevadu”(12.01.2014) are already in Snakranthi race. If Sunil’s ‘Bheemavaram Bullodu’ is released during Sankranthi there is going to be an interesting race with 2 biggies Mahesh Babu and Ram Charan’s movies.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more