»   » పవన్ కళ్యాణ్ దర్శకుడు అల్లరి నరేష్ డేట్స్ కోసం...

పవన్ కళ్యాణ్ దర్శకుడు అల్లరి నరేష్ డేట్స్ కోసం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం,అన్నవరం చిత్రాలను డైరక్ట్ చేసిన భీమినని శ్రీనివాసరావు..సినిమాల్లేక ఖాలీ పడిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పెద్ద హీరోల మీద ఆశలు వదులుకుని ప్రస్తుతం అల్లరి నరేష్ వెనక చక్కర్లు కొడుతున్నారు. అయితే గతంలో తాను రీమేక్ లు చేసి హిట్టు కొట్టినట్లుగానే..ఈ సారి కూడా తమిళంలో విజయవంతమైన తమిళపదం అనే సెటైర్ చిత్రాన్ని తెలుగుకు రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంకోసం తెలుగు వెర్షన్ రెడీ చేయించి స్క్రిప్టు పట్టుకుని అల్లరి నరేష్ వెనుక తిరుగుతున్నారు. అయితే నరేష్..కత్తి కాంతారావు, అహనా పెళ్ళంట వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల కుదరటం లేదు. అయితే అల్లరి నరేష్ కు చెప్పి ఈ స్క్రిప్టు వర్క్ చేసాడని, ఒక్కసారి స్క్రిప్టు వినేసి ఓక్ చేసేస్తే సెట్ మీదకు వెళ్ళిపోవచ్చునని ఆయన ఆశపడుతున్నారు. కాస్త సీనియర్ దర్సుకుడుని అల్లరి నరేష్ కరుణిస్తే...ఆయన కెరీర్ మళ్ళీ స్టార్టవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu