»   » అయ్యో... బాలయ్యకు అమితాబ్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి...ఇప్పుడేం చెయ్యాలి?

అయ్యో... బాలయ్యకు అమితాబ్ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి...ఇప్పుడేం చెయ్యాలి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మొన్నామధ్య సర్కార్ 3 సెట్స్ కు వెళ్లి బాలయ్య...అమితాబ్ ని కలిసిన సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తను చేయబోతున్న రైతు చిత్రంలో నటించమని ఆయన్ను కోరారు. ఆయన కూడా పాజిటివ్ గా స్పందించి 14 రోజులు పాటు డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారని మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే రైతులో తన పాత్ర విని నచ్చిందని, పాజిటివ్ గా స్పందించం వరకూ ఓకేనట. అయితే డేట్స్ విషయంలో మాత్రం ఆయన మెండి చేయి చూపి బాలయ్యకు ట్విస్ట్ ఇచ్చారట.

Big B said no to Balayya's Rythu?

ఫలానా పాత్రలో మీరు మాకు చేయాలి అన్నప్పుడు అమితాబ్... ఏ మాత్రం అవకాసం ఉన్నా డేట్స్ ఎడ్జెస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తాను, నా డైరీ చూసి, ఎప్పుడు ఖాళీ ఉంటుందో చూసి కాల్ షీట్స్ విషయం తేల్చి చెప్తాను అన్నారట.

Big B said no to Balayya's Rythu?

దాంతో ఆయన ముంబై వెళ్లి తన డైరీ చూసి...తను వరస సినిమాలు, బ్రాండ్ ఎండార్సమెంట్స్, టీవీ షోలకు వచ్చే 2017 ఆగస్టు నెల దాకా తన డైరీ నిండిపోయిందని చెప్పారట. అయితే కొన్ని ఎడ్జెస్ట్ మెంట్స్ చేసి నెక్ట్స్ జూలై లో ఇవ్వగలనని తెలియచేసారని సమాచారం. అయితే ఈ లోగా రైతుని మొదలెట్టి షూటింగ్ జరపాలని బాలయ్య, కృష్ణవంశీ ప్లానింగ్ లో ఉన్నారు. దాంతో వేరే ఆర్టిస్ట్ ని చూస్తున్నారని సమాచారం.

English summary
It is learnt that Big B recently expressed his inability to adjust to the dates of Balayya's 'Rythu'. Now they may to go for another prominent actor for this role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu