Just In
- 10 min ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 27 min ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 57 min ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
- 1 hr ago
డైరెక్టర్ తేజ ఫోన్ చేసి అలా అనడంతో ఏడ్చేశా.. అసలు విషయం చెప్పిన షకీలా
Don't Miss!
- Sports
ఏఆర్ రెహమాన్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్! ఆహ్లదకరమైన సాయంత్రం అంటూ!
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- News
ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు: ఆ రెండు జిల్లాల్లో ‘0’ కేసులు, జిల్లాలవారీగా..
- Finance
ప్రపంచంలోనే భారత్, చైనా అదుర్స్, మన పెట్టుబడులు మాత్రం డౌన్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజీత్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.. వరుసగా మూడు సినిమాలు
బిగ్ బాస్ సీజన్ 4 తో ఈ సారి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారే ఎక్కువ. అయితే మొదట్లో వారిపై అంతగా హైప్ లేకపోయినప్పటికీ రోజులు గడిచిన కొద్దీ మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్ అభిజీత్ కు వస్తున్న రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. గతంలో ఏ విన్నర్ కు దక్కని క్రేజ్ దక్కింది. ఇక మనోడి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అలంటిసినిమాలు చేస్తే బావుంటుంది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అభిజీత్ ఆ సినిమాలో చాలా కూల్ గా కనిపించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అయితే అందుకున్నాడు. అయితే ఆ తరువాత అతనికి తగ్గట్లు స్టోరీలు రాలేదు. అభిజీత్ తో ఎమోషనల్ లవ్ స్టోరీలు తెరకెక్కిస్తే బావుంటుందని నెటిజన్స్ అయితే బాగానే కామెంట్స్ చేస్తున్నారు.

అప్పుడే మొదలు పెట్టిన సోహెల్
ఇక అభిజీత్ కూడా తొందరపడకుండా కెరీర్ ను ఒక సరైన ట్రాక్ లోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే బిగ్ బాస్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన సోహెల్ ఇప్పటికే తన మొదటి సినిమాను స్టార్ట్ చేశాడు. జార్జి రెడ్డి టీమ్ తో కలిసి అద్భుతమైన స్టోరీని సెట్ చేయించుకున్నట్లు టాక్ అయితే వస్తోంది, ఇక మెగాస్టార్ ఇచ్చిన మాట ప్రకారం గెస్ట్ రోల్ చేస్తే అతని దశ తిరిగినట్లే.

తొందరగా చేస్తేనే బెటర్
ఇక అభిజీత్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ హడావుడిలోనే ఒక సినిమాను చేసి హిట్ కొడితే బావుంటుందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటె గత సీజన్స్ లలో విన్నర్ గా నిలిచిన కంటెస్టెంట్స్ పెద్దగా బిజీ అయ్యింది లేదు. క్రేజ్ తగ్గిన తరువాత చేస్తే ఎలాంటి లాభం ఉండకపోవచ్చు. ఇక ఇప్పుడు అభిజీత్ ఎలాంటి అడుగులు వేస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

వరుస మూడు సినిమాలు?
ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ యువ హీరోకు ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయట. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ కూడా అభి ఎక్కడా కూడా ఆ విషయాలను ప్రస్తావించలేదు. ఇక త్వరలోనే ఒక స్పెషల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్. వరుసగా మూడు కథలను లైన్ లో పెట్టె ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వీలైనంత వరకు అభిజీత్ తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. మరి అతనికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.