»   » బిగ్‌బాస్2లో ఛార్మీ, గీతా మాధురీ!.. పలువురి పేర్లు లీక్..

బిగ్‌బాస్2లో ఛార్మీ, గీతా మాధురీ!.. పలువురి పేర్లు లీక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు టెలివిజన్ ‌చరిత్రలో రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేసిన బిగ్‌బాస్ రియాల్టీ షో ఇటీవలే ముగిసింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. టీవీ ప్రేక్షకులకు ఎన్నో అనుభూతులను పంచిన ఈ కార్యక్రమం రెండో సీజన్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తొలి సీజన్‌కు మంచి వచ్చిన స్పందన నేపథ్యంలో రెండో సీజన్‌ను త్వరలోనే ప్రారంభించాలని నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సెలబ్రిటీల పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారి పేర్లు ఇవే.

బిగ్‌బాస్ విజేత శివబాలాజీ

బిగ్‌బాస్ విజేత శివబాలాజీ

బిగ్‌బాస్ తొలి సీజన్‌లో శివబాలాజీ విజేతగా నిలిచాడు. 14 మంది ఇంటి సభ్యులు పాల్గొన్న ఈ గేమ్ షోలో ఆదర్శ్ రన్నర్‌గా నిలిచాడు. మూడో స్థానంలో హరితేజ, నాలుగు, ఐదు స్థానాల్లో నవదీప్, అర్చన నిలిచిన సంగతి తెలిసిందే.

 14 మంది సెలబ్రిటీ పేర్లు వెలుగులోకి

14 మంది సెలబ్రిటీ పేర్లు వెలుగులోకి

బిగ్‌బాస్2కు సంబంధించి.. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభించాలన్న ప్రయత్నంలో నిర్వాహకులు ముందుకెళ్తున్నారు. ఆరు నెలల ముందే ప్లాన్ సిద్ధం చేయడం ద్వారా పేరున్న సెలబ్రీటీలను గేమ్ షోలోకి తీసుకురావాలన్న ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో డేట్ల సమస్య ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. బిగ్‌బాస్2లో పాల్గొనే 14 సెలబ్రిటీల పేర్లు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలా జాబితా ఇదే..

 బిగ్‌బాస్2లో చార్మీ

బిగ్‌బాస్2లో చార్మీ

గతంలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన చార్మీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇటీవల కాలంలో నిర్మాతగా కూడా మారి జ్యోతిలక్ష్మి చిత్రాన్ని నిర్మించింది. అంతేకాకుండా బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.

సింగర్ గీతా మాధురితో సంప్రదింపులు

సింగర్ గీతా మాధురితో సంప్రదింపులు

టాలీవుడ్‌లో తన గాన మాధుర్యంతో ఆకట్టుకొంటున్న గీతామాధురితో కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సింగర్‌గానే కాకుండా.. ఆమె అందం కూడా ఈ గేమ్ షోకు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా గీతా మాధురి వాక్చాతుర్యం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అవకాశం ఉంది.

 యాంకర్ లాస్య పేరు తెరపైకి

యాంకర్ లాస్య పేరు తెరపైకి

టెలివిజన్‌ తెరపై ముద్దు ముద్దుగా మాట్లాడుతూ స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకొన్న లాస్య పేరు కూడా నిర్వాహకులు పరిశీలించారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

తరుణ్‌ పేరు జాబితాలో

తరుణ్‌ పేరు జాబితాలో

నువ్వే కావాలి చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చి.. ఆ తర్వాత పలు కారణాల వల్ల కనుమరుగైన తరుణ్‌ కూడా బిగ్‌బాస్2 కంటెస్టంట్ జాబితాలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో సినిమాల్లో తరుణ్ నటించిన దాఖలాలు లేవు. అయితే వివాదాస్పదుడిగా మంచి పేరునే సంపాదించుకొన్నాడు.

 షార్ట్ లిస్ట్‌లో యాంకర్ ఓంకార్

షార్ట్ లిస్ట్‌లో యాంకర్ ఓంకార్

యాంకర్‌గా, జడ్జ్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా మంచి ఫామ్‌లో ఉన్న ఓంకార్‌‌ను కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తున్నది. దర్శకుడిగా రాజుగారి గదితో సక్సెస్ సాధించిన ఓంకార్ ప్రస్తుతం రాజుగారి గది2 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

పరిశీలనలో వరుణ్ సందేశ్ పేరు

పరిశీలనలో వరుణ్ సందేశ్ పేరు

గతంలో హ్యాపీడేస్, కొత్త బంగారం లోకం లాంటి హిట్లతో గుర్తింపు పొందిన యువనటుల్లో వరుణ్ సందేశ్ ఒకరు. ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్‌ సందేశ్‌ పేరును కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు పరిశీలనలోకి తీసుకొన్నట్టు సమాచారం.

 ఆర్యన్ రాజేశ్, తనీష్, కెమెడియన్ వేణు

ఆర్యన్ రాజేశ్, తనీష్, కెమెడియన్ వేణు

ఇంకా బిగ్‌బాస్2 జాబితాలో సినీ తారలు శ్రీదేవి ధన్య బాలకృష్ణ, గజాల, ఆర్యన్ రాజేశ్, తనీష్, కెమెడియన్ వేణు, యూట్యూబ్ స్టార్ వైవా హర్ష తదితరుల పేర్లు బిగ్‌బాస్2లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే బిగ్‌బాస్2 కార్యక్రమం ఎప్పుడో ప్రారంభమవుతుందో అనే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది.

 బిగ్‌బాస్2కు ఎన్టీఆర్ దూరం

బిగ్‌బాస్2కు ఎన్టీఆర్ దూరం

బిగ్‌బాస్ గేమ్ షోకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. బిగ్‌బాస్ షోను మరోస్థాయికి తీసుకెళ్లిన ఎన్టీఆర్ రెండో సీజన్‌కు దూరమవుతున్నట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్ స్థానంలో నానిని తీసుకొంటున్నట్టు సమాచారం.

English summary
Bigg Boss Telugu Game show is huge success in Telugu Television history. After success of this show, Now Bigg Boss producers concentrating on season two. Already few stars names are in news in media. Few reports, Suggest that NTR is keeping his leg away from the season2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu