»   » అల్లు అర్జున్ కొత్త హీరోయిన్ రేటు ఎంతంటే...

అల్లు అర్జున్ కొత్త హీరోయిన్ రేటు ఎంతంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందనున్న 'బద్రీనాథ్' చిత్రంలో హీరోయిన్ గా షీనాని ఎంపిక చేసినట్లు సమాచారం. షీనా ఇంతకుముందు మంచు మనోజ్ తో బిందాస్ లో చేసింది. అందరిచేతా చిన్నపిల్లలా ఉందనిపించుకున్న ఆమె వినాయిక్ దృష్టిలో పడటంతో ఈ ఎంపిక జరిగింది. ఇక ఈ సినిమా కోసం ఆమె బల్క్ గా డేట్స్ కేటాయించి కేవలం పదిహేను లక్షలు మాత్రమే అడగటంతో దర్శక,నిర్మాతలు చాలా ఖుషీగా ఉన్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ పతాకంపై 'బద్రీనాథ్' చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నారు. నరసింహనాయుడు, ఇంద్ర వంటి సూపర్ హట్స్ కు కథ అందించిన చిన్నకృష్ణ ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'వరుడు' చిత్రం మార్చి 26న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక గమ్యం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'వేదం' రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక మార్చిలో 'బద్రీనాథ్' చిత్రం సెట్స్ పైకి రానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X