»   » హీరో నానిపై మండి పడుతున్న బిందు మాధవి

హీరో నానిపై మండి పడుతున్న బిందు మాధవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆవకాయ బిర్యాని' చిత్రంతో పరిచయమైన బిందు మాధవికి ఆ తర్వాత బంపర్ ఆఫర్ తో బ్రేక్ వస్తుందని భావించింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ చెప్పుకోదగిన మలుపు ఏమీ తిరగలేదు. తెలుగు అమ్మాయి కావటమే మైనస్ గా అయిందే ఏమో కానీ ఆమె ఖాళీ పడిపోయింది. ఆ క్రమంలో ఆమెకు దొరికిన సినిమా పిల్ల జమిందారు. నాని హీరోగా అశోక్ దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం ఆమెకు బ్రేక్ ఇస్తుందని భావించింది. ఎందుకంటే అలా మొదలైంది చిత్రంతో నానికి మంచి మార్కెట్ రావటంతో ఈ సినిమా కూడా బాగానే వర్కవుట్ అవుతుందని అనుకుంది. అయితే ఆమె ఊహించిన దానికి రివర్స్ గా జరగుతోంది.

అలా మొదలైంది తర్వాత నాని ఆ విజయాన్ని నిలుపుకోవాలని తలంపుతో స్క్రిప్టులో సలహాలు ఇవ్వటం, కథను మార్చటం వంటివి చేస్తున్నాడు. అదే ఈ సినిమాకూ ఎదురైంది. బిందు మాధవి పాత్ర లెంగ్త్ తగ్గించేసారు. రీసెంట్ గా గుంటూరులో జరిగిన షూటింగ్ లో ఆమెకు ఈ విషయం అర్దమైంది. తనకు కథ చెప్పినప్పుడు చెప్పిన సీన్లేమీ తీయకపోవటంతో ఆమె ఆశ్చర్యపోయి, ఆ తర్వాత అలిగింది. సినిమా చేయనని షూటింగ్ నుంచి బయిటకు వెళ్ళిపోయింది. కానీ అసలే తనకు మార్కెట్ లేని స్ధితిలో నోరు విప్పితే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందని సన్నిహితులు చెప్పటంచో ఏమి చేయాలో అర్దం కానీ స్ధితిలో పడింది. ఇక దర్శకుడు అశోక్ గతంలో ఫ్లాష్ న్యూస్, ఉషోదయం, ఆకాశరామన్న అనే మూడు ప్లాఫ్ చిత్రాలుకు డైరక్షన్ చేసాడు. మహారాజశ్రీ, కళావర్ కింగ్ వంటి చిత్రాలను డి ఎస్ రావు గతంలో నిర్మించారు.

English summary
Bindu Madhavi who debuted with 'Avakaya Biryani' is upset with her upcoming movie 'Pilla Zamindar'. Starring Nani and Harirpriya, 'Pilla Zamindar' has been under production for quite some time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu