»   » భర్త బోనీ కపూర్‌తో శ్రీదేవి లొల్లి... చాలా సిల్లీగా ఉందే?

భర్త బోనీ కపూర్‌తో శ్రీదేవి లొల్లి... చాలా సిల్లీగా ఉందే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శ్రీదేవి-బోనీ కపూర్.... బాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట గొడవ పడ్డట్లు ప్రచారం మొదలైంది. తన మాట నెగ్గాలంటే తన మాటే నెగ్గాలని ఇద్దరూ.... వాదించుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఇద్దరూ గొడవ పడింది తమ పెద్ద కూతురు జాన్వి కపూర్ భవిష్యత్ గురించే అని..... కూతురు తొలి సినిమా విషయంలో భర్త నిర్ణయం శ్రీదేవికి అస్సలు నచ్చలేదని, ఈ విషయంలో బోనీ కపూర్-శ్రీదేవి మధ్య పెద్ద గొడవే జరిగిందని టాక్.

ఏమిటి గొడవ?

ఏమిటి గొడవ?

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్.... తొలి సినిమా హిట్టయితేనే జాన్వి కెరీర్ బావుంటుంది, లేకుంటే చాలా కష్టం అవుతుంది. అందుకే ఓ పెద్ద దర్శకుడి ద్వారా పెద్ద బ్యానర్‌లో జాన్వి సినీ రంగ ప్రవేశం ఉంటే బావుంటుందని శ్రీదేవి ఆలోచన.

బోనీ వాదన మరోలా

బోనీ వాదన మరోలా

అయితే బోనీ కపూర్ వాదన మరోలా ఉందని... తన సొంత బేనర్లోనే జాన్విని హీరోయిన్ గా పరిచయం చేయాలని, అప్పుడే అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది అని శ్రీదేవితో గొడవ పడ్డట్లు టాక్.

కూతురు కోసం...

కూతురు కోసం...

అయితే కూతురు బాగు కోరే ఇద్దరూ... ఆ భవిష్యత్ గురించి ఇలా పోట్లాడుకోవడం చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని, ఒక అండర్ స్టాండిగుకు వచ్చి మంచి నిర్ణయం తీసుకోవాలే తప్ప ఇలా పోట్లాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు.

ఎటూ తేలలేదు

ఎటూ తేలలేదు

జాన్వి కపూర్ తెరంగ్రేటం విషయంలో చాలా కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీలో జాన్వి ఎంపికైందంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏదీ ఫైనల్ కాలేదు. త్వరలోనే జాన్వి కపూర్ తొలి సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

English summary
Boney Kapoor and Sridevi Worries about Jhanvi future. Sridevi's elder daughter Jhanvi Kapoor will reportedly make her debut under Karan Johar's banner, Dharma Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu