»   » బోయపాటి శ్రీను అంత డిమాండ్ చేస్తున్నారా?

బోయపాటి శ్రీను అంత డిమాండ్ చేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ చాలా కాలం తర్వాత హిట్టిచ్చి వార్తల్లో నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు రెమ్యునేషన్ పెంచి కూడా రికార్డు సృష్టించాలనుకుంటున్నాడని సమాచారం. దాదాపు ఐదు కోట్ల వరకూ బోయపాటి తన రేటుని అనీఫియల్ గా ప్రకటించుకున్నాడని అతనితో సినిమాలు చేద్దామని ఉత్సాహపుతున్న నిర్మాతలు ఉసూరుమంటున్నారు. సింహా హిట్ తో పరిశ్రమలోని చిన్నా పెద్ద నిర్మాతలంతా బోయపాటినే తమ తదుపరి చిత్రానికి తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు. అది గమనించిన బోయపాటి..దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను నిజం చేయాలనే యోచనతో ఉన్నట్లు చెప్తున్నారు. కెఎస్ రామారావు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా చేసే చిత్రానికి ఆ రేట్ నే ఫిక్స్ చేసి అడ్వాన్స్ ఇచ్చినట్లు మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇది కావాలని రేపిన రూమరో లేక నిజంగానే జరిగిందో అర్దం కాక తలలు పట్టుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu