»   » చిరంజీవి చేతిలో సింహా డైరెక్టర్ అదృష్టం పండినట్టేనా...!?

చిరంజీవి చేతిలో సింహా డైరెక్టర్ అదృష్టం పండినట్టేనా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంత గొప్ప దర్శకుడైనా బాలకృష్ణ దగ్గర కుదేలవుతూ ఉన్న తరుణంలో అతని చేత 'సింహా" గర్జన చేయించిన బోయపాటి శ్రీను పై చిరంజీవికి గురి కుదిరింది. అందుకే 'సింహా" దర్శకుడు బోయపాటి శ్రీనుకి తన 150వ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలు అప్పగించాలని చిరంజీవి అభిప్రాయపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి 150వ చిత్రం గురించి అన్ని విశేషాలు బయటపెడుతున్నా దర్శకుడు ఎవరనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచుతున్నారు.

అయితే దర్శకుడెవరన్నది ఇంకా డిసైడ్ కాలేదని, పలువురి పేర్లు పరిశీలిస్తున్నారని, వారిలో బోయపాటి శ్రీను కూడా ఉన్నాడని సమాచారం. అందుకే ఆరెంజ్ ఆడియో ఆవిష్కరణకి బోయపాటి శ్రీనుని పిలిచి మాట్లాడించారని చెప్పుకుంటున్నారు. జూ ఎన్టీఆర్ ని మెప్పించే కథ చెప్పడంలో విఫలమయిన బోయపాటి శ్రీనుకి చిరంజీవి సినిమా చేతికొస్తే మాత్రం అతని అదృష్టం పండినట్టేనని చెప్పొచ్చు..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu