బోయపాటి శ్రీను కన్ఫ్యూజన్.. ఆ ఇద్దరు హీరోలు ఇప్పట్లో దొరకనట్లే?
టాలీవుడ్ ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని అందరి హీరోలకు ఉంటుంది. మాస్ అడియేన్స్ పల్స్ ను పర్ఫెక్ట్ గా పట్టుకోల అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. సినిమా క్లిక్కయితే థియేటర్స్ లో విజిల్స్ మాములుగా ఉండవు. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి అఖండ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అసలు మ్యాటర్ లోకి వస్తే బోయపాటి శ్రీనుకు స్టార్ హీరోలతో కమిట్మెంట్స్ చాలానే ఉన్నాయి. అఖండ రిజల్ట్ ఎలా వచ్చినా కూడా బన్నీ ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పట్లో అల్లు అర్జున్ దొరకడం చాలా కష్టం. పుష్ప అనంతరం కొంత గ్యాప్ తీసుకొని కొరటాల శివతో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. దీంతో వచ్చే ఏడాది బన్నీ బోయపాటి సినిమా లేనట్లే.

ఇక మరోవైపు రవితేజతో కూడా సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన భద్ర సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక క్రాక్ సినిమా కంటే ముందే రవితేజ బోయపాటి మధ్య చర్చలు జరిగాయి. కానీ మాస్ రాజా ఖిలాడి అనంతరం కూడా మరొక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. సో బోయపాటి అఖండ తరువాత కొంత గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలాగే రామ్ పోతినేనితో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది.


Click it and Unblock the Notifications











