హాట్ టాపిక్: బాలీవుడ్ కి బ్రహ్మానందం ప్రయాణం

అలాగే హీరోగా బ్రహ్మానందం మరో చిత్రం కమిటయినట్లు సమాచారం. .'బ్యాంకాక్ లో బ్రహ్మానందం' టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని ఇ.సత్తిబాబు డైరక్ట్ చేస్తారని చెప్తున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇంతకుముందు బ్రహ్మి హీరోగా చేసిన జఫ్ఫా చిత్రం సైతం ప్లాప్ కావటంతో హీరోగా బ్రహ్మి అంటే ఆలోచిస్తున్నారనేది నిజం.
మరో ప్రక్క ఆయన కుమారుడు బసంతి చిత్రం చేస్తున్నారు. కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి విద్యార్థికీ ఓ గుర్తింపు వస్తుంది. అలాగే... కళాశాల.. విద్యార్థి బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికీ ప్రత్యేకం. ఆ రోజులనాటి మాధుర్యాన్ని గుర్తు చేసే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'బసంతి'. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్, అలీషాబేగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని 'బాణం'ఫేం దంతలూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దంతలూరి చైతన్య మాట్లాడుతూ -'బాణం' కథ కంటే ముందే సిద్ధం చేసుకున్న కథ ఇది. బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో చదివే విద్యార్థుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశాం. సాంకేతికంగా కూడా సినిమా బాగుంటుంది' అని తెలిపారు. రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, తనికెళ్ళ భరణి, సమాజీ షిండే, ఆనంద్, ధన్‌రాజ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీకాంత్ నాయుడు విస్సా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వివేక్ కూచిభొట్ల.


Click it and Unblock the Notifications











