twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ చెప్పులు తొడుగుతున్నది ఎవరికంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్: ఉగాది రోజున .. మహేష్ తాజా చిత్రం'బ్రహ్మోత్సవం' పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో మహేష్ ప్రేమతో మోకాలిపై కింద కూర్చోని ఒక వ్యక్తి పాదాలకు చెప్పులు తొడుగుతున్నట్లు ఈ పోస్టర్ ఉంది. దాంతో ఇంతకీ ఎవరా వ్యక్తి..ఎవరి పాదాలు అవి అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

    అందుతున్న సమాచారం ప్రకారం...సినిమాలో తన తండ్రి పాత్ర వేసిన సత్యరాజ్ పాదాలకు ...మహేష్ బాబు చెప్పులు తొడుగుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో కూడా ఈ చిత్రం రిలీజ్ చేస్తూండటంతో తండ్రి పాత్రకు సత్య రాజ్ ని తీసుకున్నారు. ఆయన తెలుగులోనూ చాలా కాలంగా పాపులర్. అలాగే బాహుబలి ద్వారా దేశం మొత్తం కట్టప్పగా పరిచయం అయ్యి ..గుర్తు పట్టే స్దాయికి ఎదిగారు.

    'వచ్చింది కదా అవకాశం... ఓ మంచి మాట అనుకుందాం... ఎందుకు ఆలస్యం... అందరినీ రమ్మందాం' అంటూ ఆంగ్ల సంవత్సరాది నాడు టీజర్‌తో ప్రేక్షకులను పలకరించాడు మహేష్‌బాబు. ఇప్పుడు ఉగాదికి తెలుగు సంప్రదాయం కొట్టొచ్చే పోస్టరుతో రావటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

    Brahmotsavam First Look Poster: To Whom Mahesh Helping?

    ఇక ఈ పోస్టర్ లో లాంటివే మరిన్ని.., మనసును తడి చేసే ఇలాంటి సన్నివేశాలు మరిన్ని మా సినిమాలో ఉన్నాయంటున్నారు మహేష్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. సమంత, కాజల్‌, ప్రణీత హీరోయిన్స్. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పీవీపీ సినిమా పతాకంపై పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.

    పీవీపీ సినిమా అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ ''బ్రహ్మోత్సవం' చిత్రానికి మహేష్‌బాబు ఆయువు లాంటివారు. శ్రీకాంత్‌ అడ్డాల కథలో మహేష్‌ను చూస్తుంటే కనులపండువగా ఉంది. ప్రతి కుటుంబంలో జరిగే ఉత్సవంలా ఉంటుందీ సినిమా.

    మహేష్‌ మాయ, శ్రీకాంత్‌ అడ్డాల మార్కు, కళా దర్శకుడు తోట తరణి పనితనం, రత్నవేలు కెమెరా నైపుణ్యం, మిక్కీ జె.మేయర్‌ సంగీతం... ఇలా అన్నీ కలసి సినిమా అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా చూసి ప్రతి వ్యక్తి తనను తాను సినిమాలో చూసుకుంటాడు.

    Brahmotsavam First Look Poster: To Whom Mahesh Helping?

    ఆ వ్యక్తి ధనికుడా, పేదోడా అనేది విషయం కాదు. అందుకే 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉత్సవం అంటున్నాం. సినిమా పేరులోనే కాదు ఆడియో నుంచి సినిమా విడుదల వరకు అన్నీ బ్రహ్మాండంగా ఉండేలా చూసుకుంటున్నాం.

    ఈ నెల 24న తిరుపతిలో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాం. వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

    నాలుగు వారాలు ఆడి డబ్బులు సంపాదించే సినిమా తీయడం మా సంస్థ ఉద్దేశం కాదు. కలకాలం నిలిచిపోయే సినిమాలు చేయడమే మా అభిమతం. అదే ఆలోచనతో సినిమాలు చేస్తున్నాం. ఇకపై కూడా చేస్తామ''అన్నారు ప్రసాద్‌ వి.పొట్లూరి.

    దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ముగ్గురు నాయికల పాత్రలకూ ప్రాధాన్యముంది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది''అన్నారు. జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

    English summary
    In Brahmotsavam First Look poster Mahesh was seen helping an unknown person by giving sandals to wear. According to details he is helping to his father Sathyaraj who played a role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X