»   » మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ స్టోరీ లైన్ ఇదేనా?

మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ స్టోరీ లైన్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా సినిమా ‘శ్రీమంతుడు' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయబోయే ‘బ్రహ్మోత్సవం' సినిమాకు సిద్ధమవుతున్నాడు. జులై 10 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇదే అంటూ ఓ ప్రచారం మొదలైంది. ఆ వివరాల ప్రకారం....‘సత్యరాజ్, రేవతి ఈ చిత్రంలో మహేష్ బాబు తల్లిదండ్రుల పాత్రలో కనిపించనున్నారు. ఇదో ఫ్యామిలీ స్టోరీ. తండ్రి(సత్యరాజ్), కొడుకు(మహేష్ బాబు) మధ్య బంధాన్ని ఈచిత్రంలో అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్నారట. తల్లి(రేవతి) కుటుంబానికి సంబంధించిన అంశాలు సినిమాలో కీలకం. ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ విలువల గురించి హీరో ఎలా రియలైజ్ అయ్యాడు అనేది మెయిన్ కాన్సెప్టని అంటున్నారు.


Brahmotsavam Story line revealed

సినిమా షూటింగ్ జులై 10న మొదలు కానుంది. నాన్ స్టాప్ షూటింగ్ ప్లాన్ చేసారు. ఇప్పటికే ఆడియో, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. అన్నిఅనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 18న ఆడియో విడుదల చేసి, జనవరి 8, 2016న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తారు. తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Superstar Mahesh Babu had just completed his part for Srimanthudu and will begin the shooting of his next, Brahmotsavam from July 10th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu