»   »  సుబ్బిశెట్టి గా బ్రహ్మానందం?

సుబ్బిశెట్టి గా బ్రహ్మానందం?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bramhanandam
క్రిందటి తరంలో చింతామణి నాటకం తెలియని తెలుగు వారు ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు. అసభ్యతతో కూడిన కామిడీ ఉన్నా వేశ్యా సాంగత్యం వల్ల వచ్చే ఇబ్బందులను ఆ నాటకం సజీవంగా పట్టి మన కళ్ళముందుంచుతుంది. మన వారిని విరరీతంగా ప్రభావితం చేసిన ఆ నాటకం ప్రస్తుతం నాటకాలకు ఆదరణ కరువు అవటంతో మూలనపడి ఉంది.అయితే దాన్ని సినిమాగా తీయాలని,మళ్ళా జనం ముందుకు తేవాలని ఇంతకు ముందు కొందరు ప్రయత్నించారు. అయితే కొన్ని కుల సంఘాల అభ్యంతారతో అది వర్కవుట్ కాలేదు.అందులోనూ సుభ్బిశెట్టి పాత్ర నాటకంలో చాలా హైలెట్ గా ఉంటుంది. దాంతో ఇప్పుడా నాటకాన్ని బ్రహ్మానందాన్ని సుభ్బిశెట్టి పాత్రలో పెట్టి చేద్దామని దర్శకుడు కె.వాసు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బ్రహ్మానందం ఇప్పుడు తెలుగులో హీరోలతో సమానంగా డిమాండ్ ఉన్న కమెడియన్ కావటంతో మార్కెట్ కు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. వాస్తవానికి కొన్ని సినిమాలు ఆయన కామెడీ కోసమే రిపీట్ ఆడియన్స్ తో హౌస్ ఫుల్ అవుతున్నా యి. దాంతో ఆయన్నే ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తియ్యాలని,క్యాష్ చేసుకోవాలని చాలా మందికి ఆశ కలగటం సహజం.అయితే ఆయన గతంలో జొకర్ మామ సూపర్ అల్లుడు,బాబాయ్ హోటల్ వంటి సినిమాల్లో హీరోగా చెయ్యటం అవి ఊహించని రీతిలో పరాజయం పొందటం జర్గింది.అవి గుర్తుచేసుకుని ఆయన ఎవరికి పడితే వారికి హీరో ఛాన్స్ ఇస్తానంటున్న కమిట్ మెంట్ ఇవ్వటం లేదు.కానీ ఇప్పుడీ ప్రపోజల్ కి కమిట్ అవనున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం గిరిజన పాత్రలో ముఖ్యమంత్రి వై.యస్ .రాజశేఖర రెడ్డి అతిధి పాత్రలో చేస్తున్న చిత్రాన్ని సి.సి.రెడ్డి గారు నిర్మిస్తున్నారు.అలాగే కుర్ కురే భువనేశ్వరిని చింతామణి పాత్రకు ఆలోచిస్తున్నారుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X