»   » రీమేక్ కే రీమేక్: రామ్ చరణ్, రానా కాంబినేషన్

రీమేక్ కే రీమేక్: రామ్ చరణ్, రానా కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్ చరణ్,రానా కాంబినేషన్ లో ఓ చిత్రం అదీ ఓ రీమేక్ రానుందా అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇంతకీ ఏమిటా సినిమా అంటే ..ఇంకా బాలీవుడ్ లో విడుదల కానీ బ్రదర్శ్ చిత్రం రీమేక్ అని చెప్తున్నారు. ఆ సినిమా కూడా ఓ హాలీవుడ్ చిత్రం రీమేక్ కావటం విశేషం.

అక్షయ్ కుమార్ - సిద్దార్థ్ మల్హోత్రా కలిసి నటించిన చిత్రం ‘బ్రదర్స్'. ఈ చిత్రం హాలీవుడ్ లో హిట్ అయిన ‘వారియర్' సినిమాకి రీమేక్. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కానుంది.ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రామ్ మిర్చందని ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

బ్రదర్శ్ చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ నిర్మాత రామ్ ...ఈ విషయం తెలియచేసారు. ఇప్పటికే ప్రభాస్, రానా, రామ్ చరణ్ లని కలిసి ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం అడిగానని' తెలిపాడు. ఈ చిత్ర నిర్మాత తెలుగులోనే కాకు తమిళ రీమేక్ కోసం కూడా అన్నదమ్ములైన సూర్య - కార్తీ మరియు విక్రమ్ లను కూడా కలిసినట్లు సమాచారం.

Brothers in Tamil and Telugu soon

ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, అక్షయ్‌ కుమార్‌, జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇందులో కరీనా కపూర్‌ ఖాన్‌ 'మేరా నామ్‌ మేరీ' అనే ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఇటీవల సాంగ్ టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఊరించిన నిర్మాతలు తాజాగా పూర్తి సాంగును రిలీజ్ చేసారు. సూపర్ హాట్ లుక్ తో కరీనా కపూర్ ఆకట్టుకుంటోంది. సాంగ్ సినిమాకు మరింత ప్లస్ అవడంతో యూత్ ను థియేటర్ల వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది. ఆ సాంగ్ పైనా ఓ లుక్కేయండి

ఇంతకు ముందు 'దబంగ్-2'లో ఫెవికాల్ సాంగ్ లో చిందేసి కనువిందు చేసిన కరీనా కపూర్ , ఈ సారి కూడా తనదైన పంథాలో పసందు చేయనుంది. అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా కలిసి నటించిన బ్రదర్స్‌ చిత్రంలో ఇద్దరూ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌ కీలకమైన పాత్రలో నటించారు. ముగ్గురూ ఈ చిత్రంలో చిరుగడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు.

English summary
The remake of the 2011 Hollywood flick Warrior in Hindi as Brothers, starring Akshay Kumar and Sidharth Malhotra, is due for release, but a Tamil and Telugu remake is already on the cards. Ram Mirchandani said... “ I’ve requested Suriya, Karthi and Vikram and Ram Charan, Rana Daggubati and Prabhas to watch the Hindi adaptation next week and will soon take forward talks on the remakes in Tamil and Telugu.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu