»   » 'బ్రూస్‌లీ' : మెగా ఫ్యాన్స్ ని నిరాశపరిచే న్యూస్

'బ్రూస్‌లీ' : మెగా ఫ్యాన్స్ ని నిరాశపరిచే న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా ప్యాన్స్ ని నిరాశపరిచే న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్క్లిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే...మొదట అనుకున్నట్లుగా రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ లో చిరంజీవి పాట, డాన్స్ లేదని. ఏ హాట్ బ్యూటీతోనూ తండ్రి,కొడుకులు కలిసి డాన్స్ చేయటం లేదని.

bruslee-chiranjeevi

అనుకున్న రిలీజ్ డేట్ కే విడుదల చేయాలని నిర్ణయించుకోవటంతో సమయం ఎంతో లేదని, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కేవలం చిరంజీవి సినిమాలో ఐదు నిముషాలు మాత్రమే కనపడతాడు అంటున్నారు. మూడు రోజులు పాటు చిరంజీవి పై షూటింగ్ ప్లాన్ చేసారు.


ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే.


'బ్రూస్‌లీ' లేటెస్ట్ గా..


ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఫిల్మ్‌ సిటీలోని ఫ్లెక్‌హౌస్‌లో సాయాజీ షిండే తదితరులపై టాకీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. వచ్చే నెల 2న ఈ చిత్ర పాటలు విడుదల చేస్తారు.


వీరుడంటే... పదిమందిని ఒంటిచేత్తో చితగ్గొట్టేవాడు కాదు. పదిమంది కోసం.. పస్తులుండేవాడు, తన వాళ్ల కోసం ప్రాణాలు అడ్డుపెట్టేవాడు. అలాంటి ఓ యువకుడి జీవితాన్ని చూపిస్తున్న చిత్రం 'బ్రూస్‌లీ'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు.


bruslee

నిర్మాతలు చెప్పేదాని ప్రకారం..."బ్రూస్ లీ ...ది ఫైటర్ చిత్రం అక్టబర్ 16న విడుదల అవుతుంది. అలాగే ఈ నెలాఖరున ఆడియోని విడుదల చేస్తారు !!" ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని రచయిత గోపీ మోహన్ చెప్తున్నారు."వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
We have a disappointing news for Mega fans out there. If the sources are to be believed, there is no song and dance of Chiranjeevi in Ram Charan's Bruce Lee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu