ఎన్టీఆర్ తో సినిమా.. అలా హింట్ ఇచ్చిన బుచ్చిబాబు!
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. గురువును మించిన శిష్యుడిగా ఆయనకు మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి పేరు వచ్చేసింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో కాస్త సన్నిహితంగా ఉంటానని కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించడంతో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన హింట్ ఇచ్చాడు దర్శకుడు ఆ వివరాల్లోకి వెళితే

ఉప్పెన హిట్ కొట్టి
సుకుమార్ దగ్గర వన్-నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ ఉప్పెన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా చేసిన వైష్ణవ్ తేజ్, అలాగే కృతి శెట్టికి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

అందరూ బిజీ కానీ
అయితే డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం ఇప్పటి దాకా తన రెండో సినిమా అనౌన్స్ చేయలేదు. ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని ఒకసారి లేదు రామ్ చరణ్ తో సినిమా చేస్తాడని మరోసారి ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. కానీ ఎవరితోనూ ఆయన సినిమా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఆయన గురించి రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తో
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆయనతో సినిమా చేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొదటి సినిమా తక్కువ బడ్జెట్తో తెరకెక్కించి భారీ లాభాలు తెచ్చి పెట్టడంతో ఆయనకు పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ కూడా రెండో సినిమాకి ఆఫర్ చేసిందని ప్రచారం జరిగింది. ఇక ప్రచారం అయితే జరిగింది కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
బర్త్ డే హింట్
ఇది ఈరోజు నందమూరి తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు బుచ్చిబాబు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలిపిన బుచ్చిబాబు,''వెయిటింగ్ సార్, ఒక లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చెప్పాలనే ట్రెండ్ ని క్రియేట్ చేద్దాం. మీ అన్ కండిషనల్ అఫెక్షన్ కి ధన్యవాదాలు సార్'' అంటూ బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.
Recommended Video

32వ సినిమా బుచ్చిబాబుతోనే
ఇంకేముంది ఖచ్చితంగా ఎన్టీఆర్ -బుచ్చిబాబు సినిమా ఉంటుందని ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది.. ఇక ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనుండగా ఆ తరువాతి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. అన్నీ కుదిరితే 32వ సినిమా బుచ్చిబాబుతో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











