»   »  అంత ఖర్చు పెట్టద్దంటూ చరణ్ కు చిరు సలహా

అంత ఖర్చు పెట్టద్దంటూ చరణ్ కు చిరు సలహా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ నిర్మాతగా వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందనున్న చిరంజీవి 150 వ చిత్రం బడ్జెట్ ఎంత పెడతారనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ తమిళంలో విడుదలై హిట్టైన చిత్రం కావటంతో బడ్జెట్ పై ఓ స్పష్టత రావటం జరగింది. అయితే చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఈ బడ్జెట్ విషయమై ఆసక్తికరమైన డిస్కషన్ జరిగిందని చెప్పుకుంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ....సుమారు 100కోట్ల కు తక్కువ కాకుండా, తన తండ్రి చిరంజీవి 150 సినిమాకు ఖర్చు చేయాలని రామ్ చరణ్ నిర్ణయించారని తెలుస్తోంది. 150 వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైంది కాబట్టి... సినిమా చాలా లావిష్ గా ఉండలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయాలనుకుంటున్నారు.

Budget for Chiru's 150th movie

కాని మెగాస్టార్ ఇందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. దీనికి కారణం బ్రూస్ లీ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో అనవసరంగా డబ్బును ఖర్చు చేయోద్దని చిరు తన కొడుకు రామ్ చరణ్ కి సలహ ఇచ్చారంటున్నారు.
మరోక కారణం, లిమిటెడ్ బడ్జెట్ లోనే ఒరిజినలే సినిమా పూర్తి చేసారు, ఎలా తీయాలో మెత్తం తెలుసున్న సినిమాకి అంత ఖర్చు అనవసరం అని , తమిళ కత్తి 60 కోట్లలో ఫినీష్ అయ్యిందని, మహా అయితే మరోక 10 కోట్లు అవుతాయి తప్ప ఇంక అనవసరం అని నిర్ణయించుకున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి షుటింగ్ లో చిరంజీవి పాల్గోనున్నారు.

English summary
Chiranjeevi told his son to fix a reasonable budget for his comeback movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu