»   » క్రేజీ బాయ్ రామ్ చరణ్ తో జరిగే పనేనా!

క్రేజీ బాయ్ రామ్ చరణ్ తో జరిగే పనేనా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత బన్ని, దేశముదురు, పరుగు వంటి హిట్ చిత్రాలను ఇచ్చాడు. రీసెంట్ గా రామ్ చరణ్ తేజ చిరుత సినిమాద్వారా వెండితెరకు పరిచయమై రెండవ చిత్రమైన 'మగధీర" వంటి బ్లాక్ బస్టర్ చిత్రం అందించి మంచి క్రేజీ బాయ్ గా పేరు సంపాదించారు. ఈ క్రేజి బాయ్ రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నాడు.

ఈ విషయంపై ఇద్దరం మాట్లాడుకున్నామని, చరణ్ ఒక ఏడెనిమిది సినిమాలు పూర్తి చేశాక తమ కలయిలకలో సినిమా ఉంటుందని బన్నీ చెప్పాడు. అందుకు తగ్గ మంచి సూటబుల్ స్రిప్ట్ తో ఏ డైరక్టరైన ముందుకు వచ్చినా అందుకు మేము సిద్దంగా వున్నామంటు రీసెంట్ గా చిరంజీవి బ్లడ్ బ్యాక్, జూబ్లిహిల్స్ లో జరిగిన రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా తెలియజేశాడు.

అయితే ఈ ప్రకటన విన్న మెగా ఫాన్స్ మాత్రం అంతగా ఎక్సయిట్ కావడం లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని లోగడ చాలా సార్లు వార్తలు వచ్చాయి కానీ అవేమీ నిజం కాలేదు. కేవలం అయిదు నిముషాల గెస్ట్ అప్పీరెన్సులు మినహా అన్నదమ్ములు కలిసి కనిపించలేదు మరి చెర్రీ, బన్నీ కాంబినేషన్ అయినా నిజమయ్యేనా. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరంజ్ చిత్రం షూటింగ్ తోనూ, అల్లు అర్జున్, మంచు మనోజ్ తో కలిసి మల్టీ స్టార్ ఫిల్మిం 'వేదం" చిత్రం షూటింగ్ లతో బిజిగా ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu