»   » రవితేజ దర్శకుడుతో అల్లు అర్జున్?

రవితేజ దర్శకుడుతో అల్లు అర్జున్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ప్రస్తుతం 'రేసు గుర్రం 'షూటింగ్ బిజీలో ఉన్న అల్లు అర్జున్ మరో చిత్రం ఓకే చేసాడని సమాచారం. రవితేజతో ...'డాన్ శీను','బలుపు' రూపొందించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుందని వినపడుతోంది. బండ్ల గణేష్ ఈ చిత్రం నిర్మిస్తారని తెలుస్తోంది.


ఇద్దరమ్మాయిలతో చిత్రం ఊహించిన విధంగా హిట్ కాకపోవటంతో ఆ రికవరీ కోసం బండ్ల గణేష్ కు అల్లు అర్జున్ మరో చిత్రం చేస్తానని హామీ ఇచ్చాడని, ఆ ప్యాకేజ్ లో భాగంగానే ఈ కొత్త చిత్రం కమిటయ్యాడని చెప్తున్నారు. ఇక బలుపు చిత్రం ట్రైలర్ ఇప్పటికే అంతటా క్రేజ్ క్రియేట్ చేస్తోంది.

మరో ప్రక్క అల్లు అర్జున్ త్వరలో ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి పని చేయబోతున్నారు. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన రన్, పందెంకోడి, ఆవారా చిత్రాలు తెలుగు ప్రేక్షుకులను మెప్పించాయి. తాజాగా ఆయన రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బేనర్లో తన తొలి తెలుగు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

అల్లు అర్జున్ నటించిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఇటీవల విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం' చిత్రం చేస్తున్నారు.

English summary
Allu Arjun who is busy with ‘Race Gurram’ is all set to team up with ‘Balupu’ director Gopichand Malineni. Buzz is Bunny promised Bandla Ganesh to do another film and Bandla Ganesh is currently in talks with Gopichand Malineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu