»   » ఇదంతా అల్లరి నరేష్..స్వయం కృతాపరాధమే

ఇదంతా అల్లరి నరేష్..స్వయం కృతాపరాధమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కామెడీ చిత్రాలు అంటే భాక్సీఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ చిత్రాలు అనే ముద్ర ఉంది. అందులోనూ ఈ మధ్య కాలంలో కామెడీ చిత్రాలకు మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా అల్లరి నరేష్ చిత్రాలకు అంటే బయ్యర్లు కళ్ళు మూసుకుని కొనేసారు. అయితే ఇప్పుడు ఇదే హీరో చిత్రాలు అంటే భయపడి పరారవుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నరేష్ సినిమాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటం కారణంగా చెప్తున్నారు. లడ్డుబాబు సైతం నిరాశపరచటంతో పూర్తిగా నరేష్ పై హోప్స్ పోయాయని ఆ ఎఫెక్టు అతని తాజా చిత్రం జంపు జిలానిపై పడుతోందని తెలుస్తోంది.

అయితే ఇందులో అల్లరి నరేష్ స్వయం కృతాపరాధమే ఎక్కువ అంటున్నారు. నరేష్ సినిమాలు ఈ మధ్యకాలంలో బడ్జెట్ బాగా పెరిగిపోయాయి. సుడిగాడు వచ్చిన తర్వాత 12 కోట్లు దాకా నరేష్ సినిమాలను బిజినెస్ చేసేస్తున్నారు. దాంతో రికవరీ కష్టమైపోతోంది. దానికి కారణం నరేష్ తనకు ఇంత బడ్జెట్ పెట్టాలి అని పట్టుపట్టడమే అంటున్నారు. సేఫ్ జోన్ లో తక్కువ బడ్జెట్ లో సినిమా చేస్తే దానికి తగినట్లు బిజినెస్ జరిగి... ఫ్లాఫ్ అనిపించుకున్నా...పెద్దగా ఎవరూ లాస్ అయ్యే వాతావరణం కనపడేది కాదు.. మినిమం గ్యారెంటీతో బయిటపడేది. అమాంతంగా పెంచిన బడ్జెట్ తో ఎక్కువ రేట్లు పెట్టి కొనడం, తర్వాత తీరిగ్గా బాధపడటం జరుగుతోంది.

Buyers Scared of Allari Naresh Comedy Flicks

దీనికితోడు నరేష్ ఈ మధ్యన చేసేవన్నీ రొటీన్ కామెడీతో ఒకే తరహా జోకులతో, ప్యారెడీలతో వస్తున్నాయి. ప్యారెడీలు ఇప్పుడు టీవీలో జబర్దస్త్ వంటి పోగ్రాంకి షిప్ట్ అయిపోయాయి. జబర్దస్ నటులతో కలిసి నరేష్ తెరపై ఇదే ప్యారెడీ కామెడీ చేస్తే ఎవరు చూస్తారంటున్నారు. అంతేగాక ఇంతకు ముందు కామెడీ సినిమా అంటే నరేష్ ఒక్కడిదే ఉండేది. మహేష్ నుంచి సుధీర్ బాబు దాకా, పవన్ నుంచి అల్లు శిరీష్ దాకా తమ చిత్రాల్లో కామెడీ చేసేస్తున్నారు. ఈ నేపధ్యంలో నరేష్ కామెడీ వీరికన్నా భిన్నంగా తను మాత్రమే చేయగలిగేది ఉంటేనే చూస్తారంటున్నారు.

'జంప్‌ జిలానీ'.. టైటిల్ తో ఇప్పుడు సినిమా వస్తోంది. ఇందులో అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌ హీరోయిన్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా రాజా నిర్మాత. అంబికా కృష్ణ సమర్పకులు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన "కలగలుపు'' చిత్రం ఆధారంగా తెలుగులో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

అంబికా కృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ... తమిళంలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్న "కలగలుపు'' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నాము. ఇదే చిత్రాన్ని యూటీవి మలయాళంలో, హిందీ లో రీమేక్ చేస్తోంది. తమిళంలో అంజలి పోషించిన పాత్రకు ఇషా చావ్లాని ఎంపిక చేశాము. తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు.

English summary
Allari Naresh who made his mark with comedy flicks is rather disappointed that his film Jampu Jeelani is not getting any buyers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu