»   » నాగ్ మండిపడుతున్నాడు?...తేడావస్తే తంటానే

నాగ్ మండిపడుతున్నాడు?...తేడావస్తే తంటానే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో సినిమా ఒకటి హిట్టైందంటే ఖచ్చితంగా ఆ హీరో చేసే తదుపరి సినిమా బిజినెస్ పై ఆ ప్రభావం ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో తీసిన నాగార్జున చిత్రం సోగ్గాడే చిన్ని నాయినా పెద్ద విజయం సాధించి కోట్లు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఊపిరి నిర్మాతలు ఆ క్రేజ్ నే క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అందులో భాగంగానే ఊపిరి నిర్మాతలు తమ చిత్రానికి అరవైకోట్లు పెట్టామని చెప్తూ, అంతకు మించి బిజినెస్ చేయాలని బయ్యర్లుకు రేట్లు చెప్తున్నారని వినిపిస్తోంది. దాంతో ఇది రిస్కీ బిజినెస్ చాలా మంది బయ్యర్లు భయపడుతున్నట్లు ట్రేడ్ సర్క్లిల్ లో చెప్పుకుంటున్నారు. ఈ విషయమై నాగార్జున సైతం కోపంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.


Also Read: అదిరాయి: 'ఊపిరి' సాంగ్ టీజర్స్ (వీడియోలు)


తన పేరు చెప్పి ఊపిరి బిజినెస్ చేయాలనుకోవటం ఆయనకు నచ్చలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఏదన్నా తేడా వచ్చి, అనుకున్న స్దాయిలో సినిమా వెళ్లకపోతే తన తదుపరి చిత్రాలపై ఆ ఇంపాక్ట్ పడుతుందని ఆయన భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.


Buyers scared of Nagarjuna's Oopiri ?

అలాగే కార్తికు వరస ఫ్లాఫ్ లు తమిళంలో ఉన్నాయి. తెలుగులో మార్కెట్ లేదు. అలాగే నాగార్జునకు తెలుగులో తప్పితే తమిళంలో మార్కెట్ లేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమాని లాభాలతో కలిసి దాదాపు డబ్బై , డబ్బై ఐదు కోట్లుకు అమ్మాలనే ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందని అనుమానిస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే కానీ రికవరీలు ఉండవని మరో ప్రక్క విశ్లేకులు చెప్తున్నారు.


కార్తి, నాగార్జున కాంబినేషన్, రెండు భాషల్లో రిలీజ్ వంటి అంశాలు దృష్టిలో పెట్టి చేసిన ఈచిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. సోగ్గాడే పేరు చెప్పి మంచి రేట్లకే అమ్ముతున్నారని సమాచారం. అయితే ఎంత చిత్రం బడ్జెట్ రికవరీ అవ్వాలంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలనేది అంచనాలు వేస్తున్నారు.


Also Read: 'ఊపిరి' ఆడియో : అనసూయ డాన్సే హైలెట్ (ఫోటోస్)


చిత్రం విశేషాలకు వస్తే...స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాలు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వూపిరి' . ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.


పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్‌ సంగీతం సమకూర్చారు. మార్చి 25న 'వూపిరి' ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.ఈ వీడియోలో 'మీరు ఒక్కప్పుడు బాగా రొమాంటిక్‌ అనుకుంటా? అని కార్తీ అన్న మాటకు నాగార్జున బదులుగా... నేను ఎప్పుడూ రొమాంటిక్కే' అని సమాధానం ఇచ్చారు.

English summary
PVP announced that Oopiri movie is made on a budget of 60 Crore and increased the asking rates of the movie in all the areas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu