»   »  'ఎవడు' తో ఆమెకు హాట్రిక్ ఖాయం?

'ఎవడు' తో ఆమెకు హాట్రిక్ ఖాయం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఐరన్ లెగ్ గా ముద్రపడిన శృతి హాసన్ కి 'గబ్బర్ సింగ్' బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రం ఘన విజయం సాధించటంతో ఆమెకు కొత్త ఉత్సాహం వచ్చింది.

తాజాగా ఆ హిట్ ని కంటిన్యూ చేస్తూ 'బలుపు'కూడా మంచి విజయం సాధించటంతో ఆమె ఆనందానికి అంతేలేదు. దాంతో ఇప్పుడామెను గోల్డెన్ గర్ల్ అంటున్నారు. ఆమెను తమ చిత్రాల్లో తీసుకోవటానికి దర్శక,నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో శృతి...రామ్ చరణ్ సరసన 'ఎవడు' చిత్రంలో చేసింది. ఆ చిత్రం కూడా సక్సెస్ అయ్యి..ఆమెకు హాట్రిక్ ఖాయం అంటున్నారు. ఈ చిత్రంపై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. మరో ప్రక్క దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ ఆల్రెడీ విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. ఆడియో పంక్షన్ లో కూడా శృతి మెరిసిపోయింది.

ఈ 27 ఏళ్ల ఈ సుందరి హిందీ మూవీ 'లక్' ద్వారా నటిగా తెరంగ్రేటం చేసింది. అయితే అక్కడ లక్కు కలిసి రాక సౌతిండియా దారి పట్టి పలు చిత్రాల్లో నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు ప్రాజెక్లులు చేస్తుంది. ఒకటి ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కాగా, రెండో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న 'డి-డే'. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున జులై 19న విడుదల కాబోతున్నాయి.

English summary
From ‘Gabbar Singh’ Shruthi Hassan turned out to be golden gal and with beauty in ‘Balupu’, she got the wicket of Raviteja. Now she is aiming for her hat trick wicket and that is none other than Ram Charan in ‘Yevadu’. Already her beauty is much talked about at the audio function and with Devi Sri Prasad's tunes turning out to be a hit, expecations are high on ‘Yevadu’. Many feel odds are in favour of Shruthi getting Cherry's wicket and completing a hattrick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu