»   » ప్చ్... రామ్ కి సమస్య మళ్లీ మొదటికొచ్చింది

ప్చ్... రామ్ కి సమస్య మళ్లీ మొదటికొచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సక్సెస్ ఉన్న వ్యక్తులకే ఎక్కడైనా గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అదీ మరీ ఎక్కువగా కనపడుతుంది. వరస ఫ్లాఫులతో దూసుకుపోతున్న రామ్ కి ఎన్నడూ లేని విధంగా హీరోయిన్ సమస్యలు వస్తున్నాయి. గతంలో హీరోయిన్స్ అంతా అతని ప్రక్కన నటించటానికి ఉత్సాహం చూపించేవారు. అయితే ఇప్పుడు అతని ఫ్లాపుల్లో ఉండటంతో ఏదో వంక చెప్పి తప్పుకుంటున్నారు. రీసెంట్ గా హన్సిక డేట్స్ లేవని ప్రక్కకు వెళ్ళింది. ఇప్పుడు తాజాగా క్యాధరీన్ తాను సెకండ్ హీరోయిన్ గా చేయలేనని నో చెప్పేసిందని తెలుస్తోంది.

క్యాధరీన్, రకుల్ తమ హీరోయిన్స్ గా చెప్పుకున్న ఆ టీమ్ ఇప్పుడు మళ్లీ ఇంకో హీరోయిన్ వేటలో పడింది. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అల్లు అర్జున్ కి సెకండ్ హీరోయిన్ గా చేసింది కదా అని అడిగితే నేను లీడ్ రోల్స్ మీదే కాన్సర్టేట్ చేస్తున్నాను అని సమాధానమిచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం.

దర్శకుడుగా బలుపుతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని ఎంపిక చేసుకోవటమే కాక, హీరోయిన్ గా హిట్ చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తో ఆకట్టుకొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని ఎంచుకొన్నాడు. అలాగే హిట్ చిత్రాలకు సంగీతం అందిస్తున్న తమన్ ని టీమ్ లోకి తెచ్చుకున్నాడు. దాంతో ఇప్పుడు తనకు విజయం ఢోకా లేదనే ధైర్యంతో ఈనెల 17 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తున్నాడు.

Catherine refuses Ram's Pandaga Chesuko

రామ్‌ హీరోగా యునైటెడ్‌ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే... 'పండగ చేస్కో'. పరుచూరి కిరీటి నిర్మాత. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. 'బలుపు' తరవాత ఆయన నుంచి వస్తున్న చిత్రమిదే. 'పండగ చేస్కో'లో హీరోయిన్ గా హీరోయిన్ .. రకుల్‌. ఆ విజయంతో మూడు సినిమాలు తన ఖాతాలో వేసుకొంది. 'పండగ చేస్కో'తో మరోటి చేరిందన్నమాట.

చిత్ర సమర్పకుడు పరుచూరి ప్రసాద్‌ మాట్లాడుతూ ''వాణిజ్య అంశాలన్నీ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది. రామ్‌ నటన, ఆయన పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయి. మిగిలిన తారాగణాన్ని త్వరలోనే ఎంపిక చేస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్‌లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్‌శీను', 'బాడీగార్డ్', 'బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్‌కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''స్క్రిప్టు బాగా వచ్చింది. రామ్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. హీరోయిన్, మిగిలిన సాంకేతిన నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు . వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

English summary
Catherine Tresa refused Ram's upcoming entertainer ‘Pandaga Chesuko’ directed by Gopichand Malineni. The film stars Rakul Preet Singh in lead. Catherine confirming the same said filmmakers approached her for the second role but she refused as she was concentrating only on lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more