»   » బెయిల్ కు అప్లయ్ చేసుకున్న శిరీష్ పై లుక్‌ అవుట్‌ నోటీసులు...?

బెయిల్ కు అప్లయ్ చేసుకున్న శిరీష్ పై లుక్‌ అవుట్‌ నోటీసులు...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి రెండవ కూతురు భర్త శిరీష్‌ భరద్వాజ్‌ కట్నం వేధింపుల కేసులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శ్రీజ భర్త శిరీష్ పై హైదరాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 498(ఏ), కట్నం వేధింపుల నిరోధక చట్టం 3, 4 కింద కేసులు నమోదు చేశారు. ఇవి బెయిలుకు వీలుకాని సెక్షన్లు కావడంతో నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో ముందస్తు బెయిలు అభ్యర్థనను కోరుతూ శిరీష్‌, ఆయన తల్లి సూర్యమంగళ పేర్లతో బుధవారం సమర్సించారు.

ఐతే ప్రస్తుతం శిరీష్, అతని తల్లి అజ్ఞాతంలోకి వెళ్ళారు. తమ దరఖాస్తుపై నిర్ణయం వెలువడేలోగా పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న అనుమానంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. మహిళా పోలీసు అధికారులు శిరీష్‌ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా నాలుగు రోజుల క్రితమే శిరీష్‌ ఎక్కడికో వెళ్లాడని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

English summary
Fearing police arrest, Chiranjeevi’s son-in-law Sirish Bharadwaj, who is accused of dowry harassment, filed an anticipatory bail petition in a local court here on Thursday. Meanwhile, the Central Crime Station (CCS) police, who are investigating the case, have issued a ‘look-out notice’ against Sirish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu