»   » సుకుమార్, నాగచైతన్య చిత్రం విడుదల తేదీ ఎప్పుడంటే...

సుకుమార్, నాగచైతన్య చిత్రం విడుదల తేదీ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సుకుమార్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మార్చి ఇరవై ఐదవ తేదిన విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి మొదట అనుకున్నట్లుగా 'దటీజ్‌ మహాలక్ష్మి.." అనే టైటిల్ ‌ను కాక "ఐలవ్ యు" అనే టైటిల్ ని పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వినపడుతోంది. ఇక 'దటీజ్‌ మహాలక్ష్మి.." అనే టైటిల్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఉందని నాగచైతన్య రిజెక్టు చేసినట్లు చెప్తున్నారు. నేటితరం యువతకు ప్రతినిథిలా నిలిచేలా నాగచైతన్య పాత్ర ఉంటుందని దర్శకుడు సుకుమార్‌ చెప్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ ‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఆర్య 2, జగడం చిత్రాలు ఫెయిల్యూర్ కావటంతో సుకుమార్ ఈ సినిమాని ఎలాగయినా సంచలన విజయం సాధించేలా హిట్ కొట్టాలని చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.ఇక ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్‌ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య తాత నాగేశ్వరావు హిట్ ప్రేమాభిషేకం లోని నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నాయని..నా హృదయం చెప్తోంది అనే పాటను రీమిక్స్ చేసి షూట్ చేసారు. ఈ చిత్రం సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu