»   »  'దిల్ రాజు'కి ట్విస్ట్ ఇచ్చింది ఆ హీరో నా?

'దిల్ రాజు'కి ట్విస్ట్ ఇచ్చింది ఆ హీరో నా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dil Raju
తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు నెంబర్ వన్ గా పట్టిందల్లా బంగారంలా వెలుగుతున్న నిర్మాత ఎవరంటే కళ్ళు మూసుకుని చెప్పే నిర్మాత దిల్ రాజు. అయితే ఆయనకు తన బొమ్మ రిల్లు సినిమాలో హీరోగా చేసిన సిద్దార్ధే ట్విస్ట్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆయన తాజాగా వాసు వర్మ దర్శకత్వంలో నాగార్జున తనయుడు నాగ చైతన్యను పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఆ ప్రాసెస్ లో హీరోయిన్ గా అంజలీ బేబి షామిలీని చైతన్య ప్రక్కన నటింపచేస్తే ప్రెష్ గా ఉంటుంది క్రేజ్ కలసివస్తుందని ఫీల్ అయ్యారు. ఆ క్రమంలో ఆమెను సంప్రదించి బేరసారాలు సాగిస్తూంటే...సిద్దార్ధ కీ విషయం తెలిసింది.

వెంటనే ఆమె ఫొటో గ్రాఫ్స్ తెప్పించి చూసి షామిలీ తన ప్రక్కన చేస్తేనే బాగుంటుందని ఆలోచించి ఆమె తల్లితండ్రులను కలిసాడుట. వారిని ఒప్పించి దిల్ రాజు ని తప్పించి తన ప్రొడ్యూసర్స్ చేత ఇరవై లక్షలు ఆమెకు అడ్వాన్స్ ఇప్పించాడు. ఆనంద్ అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి ఓయ్ అని టైటిల్ ని వర్కింగ్ టైటిల్ గా వ్యవరిస్తున్నారు. ఇక దిల్ రాజుకు కాకుండా సిద్దార్దకు షామిలీ గ్రాన్ సిగ్నల్ ఇవ్వటానికి మరో కారణం కూడా ఉంది. ఆమెకు సిద్దార్ధ ఫేవరెట్ హీరో కావటం అతనికి ఫేవర్ అయ్యింది. అలా సొంతింటి హీరోనే దిల్ రాజుకి ట్విస్ట్ ఇచ్చాడు. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X