కొడితే గట్టిగా కొట్టాలని.. మరోసారి అదే కథపై కష్టపడుతున్న చంద్రశేఖర్ యేలేటి
గోపిచంద్ హీరోగా చేసిన సాహసం సినిమా అప్పట్లో మంచి రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమాను ఇంకాస్త బాగా తీసి ఉంటే మరో లెవెల్లో హిట్టయ్యి ఉండేదని టాక్ వచ్చింది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి , గోపిచంద్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆ సినిమా అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేదు.
అయినప్పటికీ చంద్రశేఖర్ యేలేటిపై ఉన్న నమ్మకం ఎవరికి తగ్గలేదు. ఇటీవల చెక్ డిజాస్టర్ అయినప్పటికీ కూడా అతని మీద చాలా మందికి నమ్మకం ఉంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అతనితో మాట్లాడి ఒక సినిమాను సెట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ప్రభాస్ తో యాక్షన్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు అయితే బాగానే వచ్చాయి. కానీ ప్రభాస్ లైనప్ చూస్తుంటే అది నమ్మడానికి కాస్త సందేహాన్ని కలిగిస్తోంది.

ఇక తీస్తే పెద్ద సినిమానే చేయాలని సాహసం తరహాలోనే ఒక యాక్షన్ అడ్వెంచర్ కథను రెడీ చేసుగున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ యేలేటి ఇటీవల నిర్మాతలకు వివరించగా మరోసారి రీ వర్క్ చేయమని సలహాలు ఇచ్చారట. అగ్ర హీరోలు ఎవరు కూడా ఇప్పట్లో డేట్స్ ఇచ్చేలా లేరు.
అందుకే కథపై మళ్ళీ రీ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. తలచుకుంటే చంద్రశేఖర్ పాన్ ఇండియా సినిమాను తీయగలడని నిర్మాతలు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ దర్శకుడు ఈసారైనా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











