»   » 'మహిమ'లు చూపిస్తానంటున్న చంద్రశేఖర్ ఏలేటి

'మహిమ'లు చూపిస్తానంటున్న చంద్రశేఖర్ ఏలేటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వారాహి చలనచిత్రం పతాకంపై చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో నిర్మాత కొర్రపాటి సాయి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘మహిమ' నే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టుకు సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ చేసారు చంద్రశేఖర్. మోహన్ లాల్ - గౌతమి - ఇర్ఫాన్ ఖాన్ లాంటి గ్రేట్ ఆర్టిస్టులతో సినిమా అనౌన్స్ చేశాడు. టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ChandraSekhar Yeleti’s Next Film 'Mahima'?

ఐతే లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చంద్రశేఖర్ ఏలేటి, ఈ చిత్రాన్ని మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న ఓ మధ్య తరగతి కుటుంబాల నేపథ్యంలో సాగే సినిమాని తెరకెక్కించబోతున్నాడని సమాచారం.

అలాగే ఈ చిత్రం కన్నడ వెర్షన్ కోసం మోహన్ లాల్ స్థానంలో శివరాజ్ కుమార్ ను ఎంచుకున్నాడతను. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుగుతున్నఈ సినిమాను నవంబరు నెలాఖర్లో మొదలుపెట్టి మూడు నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Chadra Sekhar Yeleti’s upcoming trilingual movie will be titled as Mahima . Mohanlal and Gauthami selected for this project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu