For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శంకర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్, మెగా ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్.. ఎందుకంటే ?

  |

  రొటీన్ గా ఉన్న సినిమాల కంటే తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా విలక్షణమైన సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలనే ఆదరిస్తున్నారు. దీంతో ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు సైతం ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. అదీకాక ఒకప్పుడు భాషా బౌండరీలు ఉండేవి, కానీ ఇప్పుడు బడా హీరోలు లేదా బడా దర్శకులు తెరకెక్కిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న కారణంగా దర్శకుడు ఏ భాషకు చెందిన వారైనా సరే లేదా హీరో ఏ భాషకు చెందిన వారైనా సరే ఈ సినిమాలు దాదాపు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

  రకరకాల ప్రచారాలు

  రకరకాల ప్రచారాలు


  ఇదే కోవలో ప్రపంచ ఖ్యాతి పొందిన దర్శకుడు శంకర్ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోయే ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి పాత్ర అనగానే శంకర్ గతంలో దర్శకత్వం వహించిన ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది. దీంతో వెంటనే అందరూ రామ్ చరణ్ తో తెరకెక్కబోయే సినిమా కూడా ఆ సినిమాకు సీక్వెల్ కానీ లేదా రీమేక్ కానీ అయి ఉంటుందని భావించారు.

  60 ఏళ్ల పాత్రలో రామ్ చరణ్

  60 ఏళ్ల పాత్రలో రామ్ చరణ్


  అయితే తాజాగా తమిళ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు శంకర్ రామ్ చరణ్ ను రెండు పాత్రల్లో చూపించబోతున్నాడు అని తెలుస్తోంది. తండ్రి కొడుకుల పాత్రల్లో రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి శంకర్ తన సినిమాల్లో హీరోలను విభిన్నమైన గెటప్స్ వేసి చూపించే అలవాటు ఉంది. భారతీయుడు మొదలు అపరిచితుడు, రోబో, రోబో 2.0, ఐ ఇలా దాదాపు అన్ని సినిమాల్లో తన హీరోలను విభిన్నమైన గెటప్ లు వేసి చూపించడానికి శంకర్ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో కూడా శంకర్ రామ్ చరణ్ 60 ఏళ్ల ముసలి పాత్రలో చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

  ముందు ఆలోచన లేదట

  ముందు ఆలోచన లేదట


  అయితే నిజానికి ముందుగా శంకర్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న సమయంలో రామ్ చరణ్ ను ఆ పాత్రలో నటింప చేసే ఆలోచన చేయలేదట. ఆ పెద్ద పాత్రకు మరో సీనియర్ హీరో ఎవరినైనా తీసుకోవాలని ఆయన భావించాడట.. కానీ రామ్ చరణ్ మాత్రం ఆ పాత్ర తానే చేస్తానని పట్టుపట్టడంతో శంకర్ రామ్ చరణ్ కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అదేమిటి అంటే ముందుగా ఈ పాత్ర కోసం లుక్ టెస్ట్ చేస్తారట. ఆ లుక్ టెస్ట్ చేసిన సమయంలో ఆ పాత్రకు రామ్ చరణ్ సరిపోతాడు అని భావిస్తే రామ్ చరణ్ పాత్ర చేయవచ్చని లేదంటే వేరే హీరోను తీసుకుందామని రామ్ చరణ్ కు ఆయన చెప్పినట్లు సమాచారం.

   లుక్ టెస్ట్ కి సిద్ధం

  లుక్ టెస్ట్ కి సిద్ధం

  శంకర్ చెప్పిన విషయానికి రామ్ చరణ్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రామ్ చరణ్ లుక్ టెస్ట్ కి సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి భారతీయుడు సినిమాలో కూడా కమల్ హాసన్ ఇలాంటి ముసలి పాత్రలో నటించారు. అలాగే కుర్రవాడిగా కూడా కమల్ హాసన్ ఆ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నటనకు గాను కమల్ హాసన్ కు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. మరి రామ్ చరణ్ కూడా లు టెస్ట్లో పాస్ అయ్యి ఆ పాత్ర చేసే అవకాశం ఉంటుందా ఉండదా అనేది వేచి చూడాలి.

  Pawan Kalyan కి Covid పాజిటివ్, ఊపిరితిత్తుల్లో నిమ్ము, పూర్తి వివరాలు !!
  మీమాంసలో మెగా ఫాన్స్

  మీమాంసలో మెగా ఫాన్స్

  నిజానికి చరణ్ కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఆ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన నాయక్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా అంచనాలను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఇదే టెన్షన్ నెలకొని ఉంది. శంకర్ తో సినిమా అంటే దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున అంచనాలు నెలకొంటాయి. ఈ సమయంలో ద్విపాత్రాభినయం వలన ఏమైనా చిక్కులు వచ్చి పడతాయా ? అనే మీమాంసలో మెగా ఫాన్స్ ఉన్నారని అంటున్నారు. అయితే ఇంకా శంకర్ ఈ విషయాన్ని ఫైనల్ చేయలేదని ఫైనల్ చేస్తేనే ద్విపాత్రాభినయం రామ్ చరణ్ ఆ ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు.

  English summary
  As we all know shankar is directing ram charan under dil raju production. latest buzz is that ram charan is doing dual role in movie, and one is old man role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X