»   » రామ్ చరణ్ ‘తుఫాన్’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ చరణ్ ‘తుఫాన్’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తాజా చిత్రం 'తుఫాన్' ఆడియో విడుదల ఈ నెల 21న ఉండనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే వేడుక తేదిను అధికారికంగా మరికొన్నిరోజులలో ప్రకటిస్తారని తెలుస్తోంది. 'తుఫాన్' చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమిత్ ప్రకాష్ మెహ్రా మరియు ఫ్లైయింగ్ టర్టిల్స్ సంస్థ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాషల్లోనూ సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధమవుతుంది. అపూర్వ లిఖియా దర్శకుడు. తెలుగు వెర్షన్ యోగి పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్.


ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ''ముంబై నగరాన్ని పట్టి పీడిస్తున్న ఆయిల్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన పోలీస్ అధికారిగా ఇందులో రామ్‌చరణ్ నటన అద్భుతం. చరణ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. ప్రాంతాలకు అతీతంగా అందరూ మెచ్చేలా అపూర్వ లాఖియా ఈ చిత్రాన్ని మలిచారు. ప్రియాంకా చోప్రా అందచందాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. రామ్‌చరణ్, శ్రీహరి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను రోమాంచితుల్ని చేస్తాయి. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది.'జంజీర్' విడుదలై 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఈ కొత్త 'జంజీర్' విడుదల కానుండటం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి'' అని తెలిపారు.

జంజీర్/తుఫాన్ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసారు. అయితే సీమాంధ్రలో నెలకొన్న సమైక్యవాదుల ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో సినిమాను అనుకున్న సమాయానికి విడుదల చేస్తారా? లేదా? అనేది అనుమానంగా మారింది. సమైక్యవాదులు చిరంజీవి కుటుంబీకుల సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే 'ఎవడు', 'అత్తారింటికి దారేది' చిత్రాల విడుదల నిలిచి పోయింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణంలో తుఫాన్ సినిమాను విడుదల చేసి రిస్కు ఫేస్ చేయడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు.

రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

English summary
The audio album of Ram Charan’s ‘Thoofan’ might be released on the 21st of this month, as per the latest reports being heard. The news has not yet received official confirmation. An announcement can be expected in the next few days about this event. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu