»   » ఛార్మీ...నీకు ఇప్పుడు అవసరమంటావా?

ఛార్మీ...నీకు ఇప్పుడు అవసరమంటావా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక్కసారి ఫేడవుట్ అయిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడమంటే సామాన్యమైన విషయం కాదు. ఛార్మీ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎన్ని తిప్పలు పడాలో అన్నీ పడుతోంది. తాజాగా ఆమె తన సొంత వెబ్ సైట్ ని సైతం ఓపెన్ చేసింది. charmmekaur.com పేరుతో ఈ సైట్ ని ఓపెన్ చేసి, తన ఫొటోలు, తనకు వచ్చిన అవార్డులు, తన సినిమాలు గురించి సమచారం అప్ లోడ్ చేసింది. ఫామ్ లో ఉన్నప్పుడు ఈ పని చేసి ఉంటే ఈ సైట్ కి ఖచ్చితంగా ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు ఈ సైట్ ని పట్టించుకునే అభిమానులు ఎక్కడున్నారో వెతకాలి అంటున్నారు సినీ జనం.

పెళ్లి గురించి మాట్లాడుతూ... ''అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారు. పాతికేళ్లొస్తే పెళ్లి చేసుకోవాల్సిందేనా? నలభయ్యేళ్లకి కూడా చేసుకోవచ్చు. కెరీర్‌ని చక్కబెట్టుకోవడానికి మాత్రం ఇదే సరైన సమయం. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనేమీ లేదు. 'మంత్ర 2'లో కూడా నటించబోతున్నా'' అని వివరించింది.

Charmi launches her official website

నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో ఛార్మి బాగా మెప్పిస్తుంది అనే పేరుంది. ఆమె కెరీర్‌లో ఉన్న హిట్ల గురించి మాట్లాడటం మొదలుపెడితే 'మంత్ర' ముందు వరుసలో ఉంటుంది. మాహా మాహా అంటూ ఆ సినిమాలోని ఓ పాటలో ఛార్మి వేసిన మంత్రాన్ని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందీ సినిమా.

ఇక ''తెరపై ఎలాంటి పాత్రల్లోనైనా కనిపించొచ్చు. అయితే ఇదివరకు నాకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఓ హీరోయిన్ ని ఎలా చూపిస్తున్నాం? ఎలాంటి దుస్తులు వేయిస్తున్నాం? అని కూడా ఆలోచించకుండా సినిమాలు తీశారు. అవి టీవీల్లో వస్తున్నాయంటే వెంటనే కట్టేస్తాను. అలాంటి తప్పులు మళ్లీ చేయకూడదనే దర్శకుల విషయంలో పక్కాగా ఉంటాను. మాట మీద కట్టుబడి సినిమా తీస్తానంటేనే ఒప్పుకొంటుంటా'' అంటూ చెప్పుకొచ్చింది ఛార్మి.

English summary
Charmi is coming to delight fans by launching her own website. Sharing the news on social network.Charmi is currently starring in ‘Mantra 2’, a sequel for Mantra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu