»   » చిరు ఫ్యాన్స్ కు శుభవార్త, టైం ఫిక్స్

చిరు ఫ్యాన్స్ కు శుభవార్త, టైం ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త ఈ న్యూస్. ఆయన 150 వ చిత్రం గురించి అసలు ఉంటుందా లేదా, ఉంటే ఎప్పటినుంచి ఉంటుంది... అని రోజుకో వార్త వస్తున్న ఈ సమయంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు సంభందించిన అప్ డేట్ బయిటకు వచ్చింది.

అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చిత్రం ఏప్రియల్ మూడవ వారం నుంచి రెగ్యుల ర్ మొదలకానుందని సమాచారం. అలాగే మొదట నుంచీ చెప్తూ వస్తున్న కత్తి రీమేక్ నే ఫైనల్ చేసారు. వివి వినాయిక్ స్క్రిప్టుని రీసెంట్ గా చిరంజీవి కు నేరేషన్ ఇచ్చి లాక్ చేసారని, రామ్ చరణ్ కూడా ఆ నేరేషన్ పాల్గొన్నారని సమాచారం.

Chiranjeevi 150th film from April 3rd week

ప్రస్తుతం చిరంజీవి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన తన కుమార్తె శ్రీజ వివాహం మార్చి 28న జరగుతోంది. ఈ వివాహం అయిన తర్వాత పూర్తి స్దాయిలో 150 వ చిత్రంపై కాన్సర్టేట్ చేస్తారు.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఈ చిత్రంలో స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నారు. 60 ఏళ్ల చిరంజీవి చాలా తక్కువ వయసున్న వ్యక్తిలా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి తెరపై కనిపించే ఆల్ట్రీ స్టైలిష్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతారని టాక్.

Chiranjeevi 150th film from April 3rd week

చిరంజీవి ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇందులో భాగంగా చిరంజీవికి జుంబా ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు టాక్. జుంబా అనేది కొత్త తరహా ఎరోబిక్ అండ్ డాన్స్ ఎక్సర్ సైజ్. చిరంజీవికి జుంబా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ట్రైనర్ ను నియమించారట. దీని వల్ల వెయిట్ తగ్గడంతో పాటు, చురుకుగా తయారవుతారని.... డాన్స్ మూమెంట్లలో స్పీడప్ పెరుగుతుందని అంటున్నారు.

వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్‌ తొలిసారి నిర్మాతగా వ్యవహరించనున్నారు. నయనతార కథానాయకిగా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ హీరోగా తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవి, వి.వి. వినాయక్‌ కాంబినేషన్‌లో చివరి సారిగా 'ఠాగూర్‌' చిత్రం విడుదలైంది.

English summary
Chiranjeevi's 150th film will start its regular shoot from the third week of April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu