»   » రామ్‌ చరణ్‌ బ్యానర్‌లో మెగాస్టార్ చిత్రం...!?

రామ్‌ చరణ్‌ బ్యానర్‌లో మెగాస్టార్ చిత్రం...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత ఏడాది 'మగధీర" మాత్రమే చేసిన రామ్‌ చరణ్‌ ఈ ఏడాది టైమ్‌ వేస్ట్‌ చేయకూడదనే ఉద్దేశ్యంతో 'ఆరెంజ్‌, మెరుపు" చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా వున్నాడు. కాగా ఇటీవల ఓ సందర్భంలో తను కూడా ఓ సొంత బ్యానర్‌ పెట్టి సినిమాలు నిర్మిస్తాను అని చెప్పిన రామ్‌ చరణ్‌...తన బ్యానర్‌ లో వచ్చే సినిమాల గురించి ఇటీవల ఓ సందర్భంలో ఇలా వివరించారు. నాన్న నటించే 150వ చిత్రంతో నా బ్యానర్‌ స్టార్ట్‌ అవుతుంది.

నా బ్యానర్‌ లో అర్థవంతమైన సినిమాలు నిర్మించాలనుకున్నాను. ఆ విషయం గురించి ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పాను. అయితే ముందు కమర్షియల్‌ సినిమాలు నిర్మించిన తర్వాత మీనింగ్‌ ఫుల్‌ సినిమాలు చేయాలనుకుంటున్నాను. నా హోమ్‌ బ్యానర్‌ లోనే సినిమాలు చేస్తున్నానని చాలా మంది అంటున్నారు. ఇక నుంచి బయటి బ్యానర్స్‌ లో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాను" అని వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu